పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0206- 2 బౌళి సంపుటం: 08-032

పల్లవి:

సేయవయ్య నీవు నీచిత్తము వచ్చినట్టల్లాను
యీయెడ నీమతకములెట్టుగాఁగలదో

చ. 1:

నగవులే తరచాయ నాకు నీకునేపొద్దు
వగటులే మీఁదమీఁదఁ బాయకున్నవి
మొగముచూపులే కడు ముంచుకొనునేపొద్దు
యెగసక్యాలిఁకమీఁదనెట్టుగాఁగలదో

చ. 2:

ముచ్చటలే గనమాయ మోహములనిద్దరికి
రచ్చలఁ బడెను లోలో రతులెల్లాను
పచ్చిదేరెఁ బంతములు పైపై సరసమాడఁగా
యెచ్చరికలిటమీఁదనేమిగాఁగలదో

చ. 3:

యేకతాలు సమకూడెనియ్యకోళ్ళేమనకు
వాకులు పోకులు వొక వావి గూడెను
చేకొని శ్రీవేంకటేశ జిగినన్నుఁ గూడితివి
యీకడ మేలుకు మేలులెంతేసి కాఁగలదో