పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0242-5 నాదరామక్రియ సంపుటం: 08-251

పల్లవి:

ఇంకా నేమిగావలె నిట్టె ఆనతివయ్య
జంకించఁగాని నీసలిగె చూపెను

చ. 1:

మతకము నేరఁగాని మంతనాన నీతోను
చతురతమిగులఁ గొర నేరుతు
బతిమాలనోపఁగాని పంతపు నీరతివేళ
నితవై నీచెప్పినట్టు యేమైనాఁ జేసేను

చ. 2:

వాదించరాఁగాని వన్నెలుమెరసి నీతో
ఆదిగొని సరసము లాడవచ్చేను
సాదించవద్దుగాని చల్లని నీకాఁగిటిలో
సాదువలె నీకతలు సమ్మతించేను

చ. 3:

కోపగించఁగాని నిన్నుఁ గూరిమి శ్రీవెంకటేశ
కాఁపురము సేసి నీపక్కనె వుండేను
యేపున బింకము లేల యిట్టె నన్నుఁ గూడితివి
తీపుల మోవిమాటలఁ దేనె వూసేను