పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0242-6 ముఖారి సంపుటం: 08-252

పల్లవి:

పదరకువె యింకాఁ బనిగలదు
కదియుట నిన్ను నాపై కాఁతాళముగాదా

చ. 1:

కన్నుల నవ్వితే నేమె కాఁకలు చల్లితే నేమె
వన్నెల మాయింటికి రావలెఁగా తానూ
యెన్నిలేవు వానియెమ్మె లెవ్వరుండిరో వద్దను
నిన్ను నాతఁడేమనినా నన్ను నంటగాదా

చ. 2:

సేలు వెట్టితే నేమె చేతులు ముట్టితే నేమె
వాసుల నామోము చూడవలెఁగా తాను
వేసాలు నెరపనీవె వీడెపు మదమో యేమో
బాసికము నీకిచ్చిన పని నాకేకాదా

చ. 3:

ఆడ నిన్నంటితే నేమె అట్టె తావచ్చితే నేమె
వాడుమోము నాకుఁ జూపవలెఁగా తాన
యీడనె శ్రీవెంకటేశుఁ డెనసెఁ గదవె నన్ను
వేడుకలక్కడివి నాతోడి తమేకాదా