పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0242-4 శుద్దవసంతం సంపుటం: 08-250

పల్లవి:

అందుకెపో నిన్ననేది అన్నిటా నేను
యెందుకైనా వెరవవు యెప్పుడూ నీవూ

చ. 1:

నివ్వటిల్ల నాకైతె నిన్నుఁ జూచినప్పుడెల్లా
నవ్వులె గనమాయ నానాటికి
జవ్వనపువాఁడవు సవరనివాఁడవు
రవ్వలకు వెరవవు రచ్చలనెల్లాను

చ. 2:

తాటించి నిన్ను నేను దగ్గరిన యప్పుడెల్లా
మాటలె గనమాయ మరి నోరికి
నీటుతోడివాఁడవు నేరుపరివాఁడవు
యేటికైనా వెరవవు యీడా నాడను

చ. 3:

అంకెల నిన్నుఁ గాఁగిట నలమిన యప్పుడెల్లా
జంకెనలె మిగిలెను సారె సారెకు
పొంకపు శ్రీవెంకటేశ పురుషోత్తముఁడవు
లంకెలకు వెరవవు లలనలయెడను