పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0242-3 ఆహిరి సంపుటం: 08-249

పల్లవి:

విచ్చి చెప్పె నిదె నీకు వివరముగా నేఁడు
నెచ్చెలి నిన్నిటికిని నేనేగురి సుమ్మీ

చ. 1:

అంగవించి నీతో మాటలాడక యిట్టెవున్నది
అంగన చిత్తము దెలియఁగఁ గలవా
యెంగిలిమోవితోడ నేమిమాటలాడినాను
పంగించె యెంతైనా నంటుపాయదంటాఁ జుమ్మీ

చ. 2:

తరుణి యెదుటనె తలవంచుక వున్నది
వెరవున నీపెను నవ్వించఁ గలవా
సరసము లాడితేను జంగిలి కడుపులోనఁ
దొరలితేనది గడుదోసమనీ సుమ్మీ

చ. 3:

కామిని శ్రీవెంకటేశ కాఁగిటఁ గలసె నేఁడు
చేముంచి ఆకారణము చెప్పఁగలవా
వాములై యెవ్వతెకైనా వయసు మీఁదువోతేను
దీమసాన నిన్నే నిందింతురంటాఁ జుమ్మీ