పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0239-4 సౌరాష్ట్రం సంపుటం: 08-232

పల్లవి:

ఇదివో నీదొరతన మేఁటిదయ్యా
అదనాయ నేనేమైనా నాడఁజెల్లునయ్యా

చ. 1:

నాదిక్కుచూచీ నాపె నవ్వి తలవంచేవు
యీదెస నీ జాణతన మేఁటిదయ్యా
ఆదిగో నాపె దూతికనై వచ్చితి నీవద్దికి
పాదుగా నన్నింతసేసి పరాకై తివేమయ్యా

చ. 2:

మచ్చాలువేసీ నాపె మాటలాడేవు నీవైతే
యిచ్చట నీ జాణతన మేఁటిదయ్యా
నెచ్చెలింటికి రమ్మంటే నీవు నన్ను ముట్టితివి
అచ్చలాన గుట్టుసేసేవదేమయ్యా

చ. 3:

వెల్లవిరిసేసీ నాపె వింత నీ జాణతనాలు
యిల్లిదె శ్రీవెంకటేశ యేఁటిదయ్యా
తొల్లె యాపెఁగూడి జెల్లెల నన్నూఁగూడితి
వుల్లసాన మెచ్చేవు నీ వుపమిదేమయ్యా