పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0239-1 హిందోళవసంతం సంపుటం: 08-229

పల్లవి:

ఆయనాయ నుండవయ్య అన్నియుఁగంటిమి నేము
చేయి చేతఁ బట్టియ్యఁగా సిగ్గువడవలదా

చ. 1:

నిగ్గుల నీవంటివారు నిజమాడి బతుకఁగా
కగ్గినవేళల నేము కల్లలాడేమా
బగ్గన నంటివి నీవు బమ్మచారి నంటాను
వెగ్గళించి పదారువేలు సతులుండఁగా

చ. 2:

పలుమారు నీవె యింత పంతము లాడుకోఁగా
కెలన నేమిఁక మరి కిందుపడేమా
పొలసి విఱ్ఱవీఁగేవు పరుభుఁత్తముఁడనంటా
వొలిసి లకిమమ్మ నీవురమెక్కివుండఁగా

చ. 3:

పైపై శ్రీవెంకటేశ పాదము నీవు చాఁచఁగా
యేపున మొక్కేవారమిప్పుడు నేమా
దాపుగ నన్నుఁగూడి ధర్మాలు బోధించేవు
రూపై యెత్తుకవచ్చిన రుకుమిణివుండఁగా