పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0204-4 మంగళకౌశిక సంపుటం: 08-022

పల్లవి:

ఎరఁగరటే ఆతనినెందాఁకనే
తరితీపు సేసేటి మీతగవెందాఁకనే

చ. 1:

ఇక్కడనుండే విభుఁడు యెదురుచూచును నాకు
యిక్కడనే శింగారించే రెందాఁకనే
వెక్కసమై నామాటకు వీనులాలకించునట్టే
చుక్కబొట్టే పెట్టఁబట్టె సూటియెందాఁకనే

చ. 2:

సొరిదినింతక (కు?) నా సుద్దులే యడుగుచుండు
యిరవుగఁ గొప్పువెట్టేరెందాఁకనే
మరపి యాతఁడు నన్ను మనసులోఁ దలపోయి
తిరముగ పల్లకి దెచ్చుటెందాఁకనే

చ. 3:

మలసి నాకుఁగా లోన మంతనమాడుతానుండు
యెలమిఁదోడుక వచ్చేరెందాఁకనే
కలసితినిట్టె వచ్చి ఘను శ్రీవేంకటేశ్వరుఁ
గొలిచి యిట్టేవుండే గుట్లెందాఁకనే