ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0204-3 శ్రీరాగం సంపుటం: 08-021
పల్లవి:
ఎడమాటలిఁకనేల యెందాఁకాను
విడువరాని బాసలు వెంట వచ్చీనయ్యా
చ. 1:
పడఁతి పయ్యదలోని పాలిండ్లు నీకునిట్టె
విడిదల సేసెనిందు విచ్చాయవయ్యా
వుడివోని వలపుల వులుపా వట్టినదిదె
వెడఁగుఁదనాలేఁటికి విచ్చేయవయ్యా
చ. 2:
కందువ తేనెల మోవి కలగంపుచూవులతో
విందులు నీకుఁ బెట్టీ విచ్చేయవయ్యా
కందువమాటలఁ జెప్పి కడునుపచారాలు
విందువుగాని యీడకు విచ్చేయవయ్యా
చ. 3:
కూడఁగఁ దనమేను చిగురుఁబానుపుగా నీకు
వేడుకఁ బరచెనిదె విచ్చేయవయ్యా
యీడనె శ్రీవేంకటేశ యింతిని గలసితివి
వీడెమిచ్చీనిట్లనే విచ్చేయవయ్యా