పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0235- 3 భైరవి సంపుటం: 08-207

పల్లవి:

మూసినముత్యాలవంటి ముద్దరాండ్లము
యీసరిబేసికి నీతో నెదురాడఁగలమా

చ. 1:

బలిమేలసేయను పలుకకుండినవారి
అలిగేటివారులేరా ఆఁడువారు
చలపట్టి మాటలాడ జాణలులేరా వూరిలో
యెలమి నీతో నేము యెదురాడఁగలమా

చ. 2:

సిరసేలయెత్తను సిగ్గువడివున్నవారి
జరసేటివారులేరా సారెనింతులు
దొరవై పనులుగొన తొత్తులు బంట్లులేరా
యిరవై నీతో నేము యెదురాడఁగలమా

చ. 3:

కొంగులేలపట్టను గుట్టుననుండినవారి
కంగివున్నవారులేరా కామినులు
రంగుగ శ్రీవెంకటేశ రతి నన్నుఁగూడితివి
యింగితాన నీతో నేము యెదురాడఁగలమా