పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0235-2 పాడి సంపుటం: 08-206

పల్లవి:

ఒట్టువెట్టుకొంటే నేమి వొద్దు దోసములేదనె
వట్టిచింతఁ బొరలక వద్దికి రారాదా

చ. 1:

మలసేయప్పటివేళ మాటమాటజగడాల
అలిగి లేచిపోయితే నందుకేమి
వెలినుండి నీవేల విరహనఁ బొరలేవు
చలమొద్దు నావద్దికి సరుగ రారాదా

చ. 2:

నినుఁ జూచి నవ్వితేను నిజము నెరపెనంటా
గునిసి యల్లంతనే కూచుంటివి
మనసు పట్టగలేక మరియేల పొరలేవు
చనవుసేక నామంచానకు రారాదా

చ. 3:

వేడుక యీరతి నీవె వేళమె ముందుగరఁగి
తోడనె సిగ్గులఁబొంది దూరుకొనేవు
యీడకేతెంచి శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
మాడమాడ పంతములా మరియు రారాదా