పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0235-4 కాంబోది సంపుటం: 08-208

పల్లవి:

పుట్టుభోగిజవరాలు పొలిఁతి యిది
పట్టెమంచముమీఁదటఁ బవళించేదేవుడు

చ. 1:

కందువ నీకిందాఁకా గతులు చెప్పనేపట్టె
యెందాఁకా వేగించు నింతి నీతోను
అందముగ నిలుచుండి ఆకుమడిచియ్యఁబట్టె
కుందణపు గద్దెమీఁదఁ గూచుండేదేవుడు

చ. 2:

వూడిగాలుసేసి నీవొద్దనుండనేపట్టె
యేడగాఁ గొలువుసేసు నెదుట నీకు
పాడితోఁ బందెమువేసి పగడసాలాడఁబట్టె
ఆడనే పరపుమీఁద నలపారే దెపుడు

చ. 3:

గక్కన నీవు గూడఁగా కన్నుల జంక్కించఁబట్టె
యెక్కడగా సన్నసేసు నింతేసి నీకు
చక్కని శ్రీవెంకటేశ సమ్మతించుకొనఁబట్టె
వొక్క మలగుపై నొరగుండి నవ్వేదెపుడు