పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0234-3 సామంతం సంపుటం: 08-201

పల్లవి:

వలెగా యివిగొన్ని వట్టివేసాలు
అలసితివన్నిటాను ఆయనాయలేవే

చ. 1:

చిక్కని చెమటలకే సిగ్గులు వడేవు నీవు
యెక్కువనిట్టూర్పులకు నేమి సేసేవే
నెక్కొన్న రతిచిన్నలు నీతలనే వేగెనటే
ముక్కునబంటి భోగించే ముగుదువా నీవు

చ. 2:

అలకల చెదరకు నట్టే సిరసు వంచేవు
యెలమిఁ గన్నులతేట లెందుఁబెట్టేవే
నెలకొన్న యీవన్నెలు నీవల్లనే వచ్చెనటే
కలగంపగాఁ గలసే కన్నెవానీవు

చ. 3:

బొట్టు చెదరినందుకు పొంచి తెరలు వేసేవు
యిట్టె నీమోము కళలెట్టు దాఁచేవే
నెట్టన శ్రీవెంకటేశు నీవేకూడితివటే
పటము గట్టక పొందే చాలవా నీవు