పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0234-2 సాళంగం సంపుటం: 08-200

పల్లవి:

నీయితవు దెలియక నే వేగిరపడరాదు
యీయెడ నీయాలనై యింటనే వుందానను

చ. 1:

సారె నేనవ్విన నవ్వు చలువో వేఁడో
ఆరీతి నీమతిఁ గలట్టానఁ లేవయ్యా
నీరుకొద్ది తామరనై నీతోఁ బొందుసేసేను
పేరబెట్టితేవలపు పిండంతేనిప్పటి

చ. 2:

పలికేటి నామాట పలచనో చిక్కనో
అలరి నీకుఁ దోచినట్టానతీవయ్యా
బలిమికొది పంతానఁ బట్టి నిన్నుఁ బెనఁగేను
వలచినవలపులు వచ్చినంతేలాభము

చ. 3:

కూడినట్టి నాకూటమి కొసరో పిసరో
ఆడినంతా నియ్యకొనే నానతీవయ్యా
వేడుక శ్రీవెంకటేశ వెన్నకొద్దేనెయ్యీ
తోడరాఁగా వలపులు తరినంతేవాకిలి