పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0234-1 కేదారగౌళ సంపుటం: 08-199

పల్లవి:

ఎందువోయితి విందాఁకా యెక్కడనుండె నీనేర్పు
బందెకు నప్పుడాతని పట్టుకుండవలదా

చ. 1:

నేనాతనితో నవ్వితే నీకేలే చింత
నాననిచ్చి నీవూఁ గొంత నవ్వరాదా
సానఁబెట్టె(ట్ట?)తఁడు చూపు జళిపించేయపుడు
మానుపరాదా నీమగని సన్నలను

చ. 2:

చెక్కాతని నేనొక్కితే చిమిడేవదేమే
చిక్కనిచ్చి నీవూఁ జేఁత సేయరాదా
మక్కువ నాతఁడు నామర్మమంటేయపుడు
నిక్కి కోపగించరాదా నీపతినెమ్మెలను

చ. 3:

కలసితే నీవితని గద్దించే వెవ్వతవే
వలసినప్పుడు నీవూ వంచుకోరాదా
యెలమి శ్రీవెంకటేశుఁ డెలయించేయపుడు
వలపించి నీవిభుఁని వంకలొత్తరాదా