పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0233-5 సామంతం సంపుటం: 08-197

పల్లవి:

ఆసతి మరఁగువాఁడ వన్నిటా నీవు
మోసపోక నీవాపె ముదులదేరాదా

చ. 1:

చేపట్టేవు నీకు నేఁ జెప్పినట్టు సేసేఁగాని
ఆపె నడిగి రారాదా ఆమాటే
దూపిలేవు నీచేఁతకుఁ దొరలకుందాననంటా
చాపలాన నీవాపెను సమ్మతింపించరాదా

చ. 2:

పైకొనేవు నీకు నేఁ బనులుసేసేఁగాని
ఆకాంతఁ దోడితేరాదా అప్పణగాను
కాకరివై దూరేవు గక్కన విడెమీనంటా
పోకులఁబోక నీవాపెఁ బూఁటవెట్టరాదా

చ. 3:

పూవులవేసేవు నీకు పొందైవుండేఁగాని
ఆవనితఁ గూడరాదా అప్పుడే ముందే
శ్రీ వెంకటేశ నన్నుఁ జెందితివి ఆలనంటా
కావించే(చా?) పెకుఁ జెల్లెలిఁగా నన్నుఁ జేయరాదా