పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0230-6 మెంచభౌళి సంపుటం: 08-180

పల్లవి:

ఎవ్వరు బుద్దిచెప్పేరు యిద్దరికి మీకు నిఁక
అవ్వల నివ్వల నీవే ఆదరించు మీపెను

చ. 1:

మచ్చరపు సతులతో మారుమలతువుగాక
యిచ్చకపు సతితోడ నింతగలదా
తచ్చి నీకు కుంచవేసి తలవంచుకున్నదాపె
గుచ్చి నీవైతే మోనాన గుట్టుననున్నాఁడవు

చ. 2:

పంతపు వనితలనె పైపై సాదింతువుగాక
చింతించే నీవద్దిచెలిఁ జిమ్మిరేఁతురా
మంతనాన విడెమిచ్చి మానాన మణిఁగీనాపె
రంతుల నీవైతేను రాజముచూపేవు

చ. 3:

వేసాల మగువలతో విఱ్ఱవీఁగుదువుగాక
ఆసపడ్డకాంత నింత అలయింతురా
పాసిన కాఁకలుదీర పాదములొత్తీనాపె
శ్రీ సతీశ కూడితివి శ్రీ వెంకటేశుఁడవు