పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0230-4 పాడి సంపుటం: 08-178

పల్లవి:

చూడ నిట్టున్నాఁడవు సోదించి చూచితేను
మాడకు వేగురిఁదెచ్చే మతకమెరఁగను

చ. 1:

తగిలి యెవ్వతెయైనాఁ దప్పక నిన్నుఁ జూచితే
జిగురంటినట్టేకాక చేరి పాసీనా
మగువ భ్రమయించును మగవాని నందురు
మగువల మించితివి మహిమలెరఁగను

చ. 2:

నీఁటుకత్తె యెవ్వతైనా నీతోను మాటాడితే
వేఁటమేకమౌఁగాక వేరె పాసీనా
మాఁటల పందిలివెట్టు మానిని యందురుగాని
మాఁటల గుళ్ళుగట్టి మము నింతసేసేవు

చ. 3:

పొలసితే నీ ముందరఁ బోరాక యెవ్వతైనా
వలలకు లోనేకాక వడిఁ దాసీనా
యిల లక్ష్మీ శ్రీవేంకటేశ నీ వురమెక్కెను
మలసి నా వురమెక్కి మన్నించు టెరఁగను