పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0230-3 కాంబోది సంపుటం: 08-177

పల్లవి:

ఎట్టుసేసినాఁ జేయుమిక నాతఁడల్లవాడే
పట్టరాని వ్రతములో పానువుపైనే

చ. 1:

కప్పురపుమోవి నీవు కాంతునికిఁ జూపఁగాను
దప్పిదేరీ నాతఁడదే దవ్వులనుండే
చెప్పరానిచేఁతలు చేరి నీవు సేయఁగాను
చిప్పిలీ నీరతులను చిత్తములోనే

చ. 2:

చన్నులఁ బయ్యద నీవు జారఁదోయఁగా నతఁడు
కన్నుల పండుగసేసీఁ గడనుండే
వెన్నెలనవ్వులు నీవు వెదచల్లఁగాఁ జూచి
మిన్నక మోముననెల్లా మించీని కళలు

చ. 3:

చివ్వన దగ్గరి నీవు శ్రీ వేంకటేశుఁ గూడఁగా
జవ్వనాన ఫలమంది సరుసనుండె
రవ్వగా సరసము నీరపముగా నాడఁగాను
బువ్వపువిందులు చేత భోగించే నిపుడు