పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0230-2 శుద్దవసంతం సంపుటం: 08-176

పల్లవి:

చెప్పకున్న దోసము చేఁతలెరిఁగినవారు
కప్పిన సంతోసాలఁ గందువలెరఁగరు

చ. 1:

కన్నెలాల మీరిద్దరు కాఁగిలించేరు చుట్టాలై
పిన్నలు చన్నులొత్తీనే పెరిగేపొద్దు
మున్నాడి యొక్కరొక్కరు మొక్కలాడేరప్పటిని
కన్నచో గోళ్ళుదాఁకీనే కడువాఁడిపాద్దు

చ. 2:

దిట్టలై ముచ్చటలుగా తీపులు మాటలాడేరు
యిట్టె తేనెగారీ నిప్పలెర్లించే (?) పొద్దు
చెట్టపట్టాలు వట్టేరు చేరి పిరుఁదులురాయ
బట్టబయలయ్యా మరుబండ్లు వారేపొద్దు

చ. 3:

బంతినే మీరిద్దరును పాదుగాఁ గూచుండేరు
గుంతలయ్యీఁ బరపల్లాఁ గూడేటిపొద్దు
యింతలో శ్రీవేంకటేశుఁడెనసె నిన్నునూ నన్నూ
రంతుగా మాచేనాడించే రాజసమీపాద్దు