పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0229-4 వరాళి సంపుటం: 08-172

పల్లవి:

కక్కూరితితనమేల కడదాఁకాను
అక్కరతో నింత నిజమాడి బదుకరాదా

చ. 1:

శిరసుపై తలఁబాలు చెలిచేతితోనున్నవి
యెరవుగ నాతో నీవు యేలబొంకేవు
నిరతినిందుకుఁ గాను నీతోనేల అలిగేను
అరుదుగ నీవు నిజమాడి బదుకరాదా

చ. 2:

నిన్నునొత్తిన చన్నులు నెలఁతరొమ్ముననవే
యిన్నిటా నీవు నాతోనేల బొంకేవు
సన్నల నిన్నుఁదిట్టుచు సాదించేనా నేనేమి
అన్నిటాను యిట్టే నిజమాడి బదుకరాదా

చ. 3:

నీయధరముపై తేనె నెలఁతపుక్కిలి నిండె
యీయెడనెవ్వరున్నారు యేల బొంకేవు
చేయిచ్చి యలమేల్మంగ శ్రీవేంకటేశుఁడ కూడే
వాయింతినే నేను నిజమాడి బదుకరాదా