పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0229-5 శుద్దదేశి సంపుటం: 08-173

పల్లవి:

ఎప్పుడూను నీవోజలిటువంటివి
తప్పక ఆసతి నీకుఁ దక్కువా యేమైనాను

చ. 1:

పడఁతి లోలోసిగ్గు పచ్చినవ్వే మోళ్ళుఁగాక
అడిగితేఁ జెప్పునా అదియేఁటిది
కడలేని మగవాని కాతరము జాడిట్టిదే
గడుసుఁ దనాననింతఁ గాకుసేయఁ జూచును

చ. 2:

చెలియతమకమెల్లా చెమటలై కారుఁగాక
వెలిఁబెట్టవచ్చునా వేఁడుకొనేవు
మలసేటి జాణని మతకములిట్టివే
చలివాపి సతులనాలురేఁచఁ జూచును

చ. 3:

అంగనరతులచొక్కు ఆతుమలో నుండుఁగాక
సంగడించితేనంటునా సారె నీకును
యింగితాన శ్రీవేంకటేశ నీకూటమిగల్గె
రంగుగ నీబోఁటిమేలు రచ్చఁబెట్పఁ జూచును