పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0229-6 మాళవశ్రీ సంపుటం: 08-174

పల్లవి:

మఱియేఁటి సుద్దులు మమ్మేమడిగేవు నీవు
మెఱసి మీయిక్కువలు మించెను దోమట్లె

చ. 1:

యింతిని నీవు చూచితే నింగితాకారమెరోఁగి
చింతతోడఁ దలవంచి సిగ్గువడెను
వింతగానందుకు నీవు వెడనవ్వు నవ్వితివి
పొంతనే కమ్మర నాకె బొమ్మల జంకించెను

చ. 2:

పడఁతిని దగ్గరితే భావమెల్లాఁ దెలుసుక
చిడుముడి తమకానఁ జెమరించెను
బడినే అందుకుఁ బూవుబంతి నీవు వేసితివి
వొడిఁ బెట్టుకొని యాకె వుద్దండాన మొక్కెను

చ. 3:

అంగనఁ గాఁగిలించితే ఆయములట్టే కరఁగె
సంగతిగాఁ బవళించె శయ్యమీఁదను
అంగవించి శ్రీవెంకటాధిప నీవు గూడితివి
వుంగరములా కెవేళ(ళ్ళ?) నొగి మార్పులాడెను