పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0229-1 దేవగాంధారి సంపుటం: 08-169

పల్లవి:

ఆయమంటి మోవితీపులానఁగ రాదా
వోయమ్మ వద్దనున్నాఁడు వూరకుండ నేఁటికే

చ. 1:

చెక్కు నొక్కఁ బొద్దులేదో సేదదేరఁ బొద్దులేదొ
గుక్కక పతిఁ గాఁగిటఁ గూడఁగ రాదా
వెక్కసపు విరహాన విసిగితివిందాఁక
యిక్కడికే పతి వచ్చె నిఁకనేలే కొసరు

చ. 2:

నవ్వు నవ్వ వేళలేదొ నమ్మికకు వేళలేదో
పువ్వువలెఁ గాఁగిటను పొదుగరాదా
దవ్వుల నున్నాఁడంటా తమకించితివిందాఁక
యివ్వల నీ గుబ్బలంటె నిఁక జాగువలెనా

చ. 3:

మాటాడఁ దతిలేదొ మనసియ్యఁ దతిలేదొ
గాఁటముగ దెరవేసి కలయరాదా
యేఁట వెట్టి శ్రీ వెంకటేశుఁడిదె నిన్నుఁగూడె
యీటుగానే మన్నించె నిఁక నెదురేదే