పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0224-3 సాళంగనాట సంపుటం: 08-141

పల్లవి:

నడుమఁ జెమట భవనాశియేరు మీకునబ్బె
ఆడియాలముగ లోలోనందెఁగా మీవలపు

చ. 1:

యెదురుఁ గొండపైనెక్కి యిందిర నీపైఁ గుచము
లెదురుచాఁచి వొత్తెనేడకు నేడ
కదిసి శ్రీ నరసింహ కాఁగలించితి వాపెను
అదన నిందుకు నందు నందెఁగా మీవలపు

చ. 2:

యీడనుండి తన పాదమింతి నీతొడపైఁ జాఁచి
యీడుజోడుగాఁ గూచుండెనిచ్చ యెరిఁగి
వేడుక నీమోవినాపె ఇందుగా మోవంటితివి
ఆడానీడా దోఁటిగా నేఁడందెఁగా మీవలపు

చ. 3:

నీనీడ ఆపైపైఁ బారి నీఫైనాపెనీడవారి
తానకమై రెంటా మీరు తగిలితిరి
పూని యహోబలమునఁ బొంచి శ్రీ వేంకటేశుఁడ
ఆనకమై రెంటాఁ బెండ్లైయంటెఁగామీవలపు