పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

/G-804


7ఎఫ్. ఈ చట్టము క్రింద సద్భావముతో చేసిన లేక చేయుటకు ఉద్దేశించిన దేనికైనను సంబంధించి సందర్భానుసారముగ, కేంద్ర ప్రభుత్వము, ట్రిబ్యునలు, బోర్దు లేక సలహా ప్యానలుపై గాని కేంద్ర ప్రభుత్వము, ట్రిబ్యునలు, బోర్దు లేక సలహా ప్యానలుయొక్క ఎవరేని అధికారిపై, లేక సభ్యునిపైగాని ఎట్టి దావా లేక శాసనబద్ద చర్య ఉండదు.

8. (1) కేంద్ర ప్రభుత్వము, రాజపత్రములో అధిసూచన ద్వారా ఈ భాగము నందలి నిబంధనలను అమలుపరచుటకు నియమములు చేయవచ్చును.

(2) ప్రత్యేకించియు, పైన తెల్పిన అధికారము యొక్క వ్యాపకతకు భంగము లేకుండను ఈ పరిచ్ఛేదము క్రింద చేయబడిన నియమములలో ఈ క్రింది వాటి కొరకు నియమములు చేయవచ్చును:–

(ఏ) బోర్డు సభ్యులకు చెల్లించదగు బత్తెములు మరియు ఫీజు;

(బీ) బోర్డు సభ్యుల సేవా నిబంధనలు, మరియు షరతులు;

(సీ) ధ్రువపత్రము కొరకు బోర్దుకు దరఖాస్తు చేసుకొను రీతి; బోర్దు ఫిల్మును పరీక్షించు రీతి; అందుకు విధించదగు ఫీజు;

(డీ) ఫిల్ములను పరీక్షించుటలో ప్రాంతీయ అధికారులు పాల్గొనుట; ఏ నిర్బంధనలకు లోబడి తాత్కాలిక ధ్రువపత్రములను జారీచేయుటకు పరిచ్ఛేదము 7బీ క్రింద ప్రాంతీయ అధికారులకు ప్రాధికారమొసగవచ్చునో ఆ నిర్భంధనలు, ఆ షరతులు; మరియు అట్టి ధ్రువపత్రములు శాసనమాన్యత కలిగియుండు కాలావధి;

(ఈ) బోర్దు ఏ ఫిల్ము విషయములోనైనను ఏదేని సలహా ప్యానలును సంప్రదించవలసిన రీతి;

(ఎఫ్) సలహా ప్యానలు సభ్యులకు చెల్లించదగు బత్తెములు లేక ఫీజు;

(జీ) ఫిల్ములకు గుర్తు వేయుట;

(హెచ్) ట్రిబ్యునరలు సభ్యులకు చెల్లించదగు బత్తెములు లేక ఫీజు;

(ఐ) ట్రిబ్యునలు కార్యదర్శి మరియు ఇతర సభ్యుల యొక్క అధికారములు కర్తవ్యములు;

(జే) ట్రిబ్యునలు ఛైర్మను మరియు సభ్యుల యొక్కయు కార్యదర్శి మరియు ఇతర ఉద్యోగుల యొక్కయు ఇతర సేవా నిబంధనలు మరియు షరతులు;

(కే) అపీలుదారు, అపీలుకు సంబంధించి ట్రిబ్యునలుకు చెల్లించదగు ఫీజు;

(ఎల్) (సాధారణముగా ఫిల్ముల నిడివికి లేక ప్రత్యేకముగా ఏదేని కోవకు చెందిన ఫిల్ముల నిడివికి సంబంధించిన పరతులతో సహా) ఏ షరతులకులోబరచి ఏదేని ధ్రువపత్రము ఈయవచ్చునో ఆ షరతులు, లేక ఏ పరిస్థితులలొ ఏదేని ధ్రువపత్రము ఈయవచ్చునో ఆ పరిస్థితులు;

(ఎమ్) విహితపరచవలసిన లేక విహితపరచదగు ఏదేని ఇతర విషయము;

(3) ఈ భాగము క్రింద కేంద్ర ప్రభుత్వము చేసిన ప్రతినియమమును, దానిని చేసిన పిమ్మట వీలయినంత శీఘ్రముగ, పార్లమెంటు అధివేశనములోనున్న సమయమున, మొత్తము ముప్పది దినముల కాలావధిపాటు దాని ప్రతియొక సదనము సమక్షమున ఉంచవలెను. ఆ ముప్పది దినములు ఒకే అధివేశనములోగాని,