పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

| IG-805 రెండు లేక అంతకు మించి వరుసగావచ్చు అధివేశనములలోగాని చేరియుండవచ్చును; పైన చెప్పిన అధివేశనమునకు లేక వరుసగా వచ్చు అధివేశనములకు వెనువెంటనే వచ్చు అధివేశనము ముగియుటకు పూర్వమే ఆ నియమములో ఏదేని మార్పు చేయుటకు ఉభయ సదనములు , అంగీకరించినచో లేక ఆ నియమమును చేయరాదని ఉభయ సదనములు అంగీకరించినచో అటు పిమ్మట, ఆ నియమము అట్లు మార్పు చేసిన రూపములో మాత్రమే ప్రభావము కలిగియుండును లేక సందర్భానుసారముగ ప్రభావ రహితమై యుండును , అయినప్పటికినీ, ఏదేని అట్టి మార్పుగాని, రద్దుగాని అంతకు పూర్వము ఆ నియమము క్రింద చేసిన దేని శాసనమాన్యతక్కెనను భంగము కలిగించదు .

9. కేంద్ర ప్రభుత్వము వ్రాతమూలకమైన ఉత్తరువు ద్వారా, ఏదేని ఫిల్ము లేక ఏదేని కోవకు చెందిన ఫిల్ముల ప్రదర్శనను తాము విధించునట్టి షరతులు, మరియు నిర్బంధనలు ఏవేని ఉన్నచో వాటికి లోబరచి, ఈ భాగమునందలి ఏవేని నిబంధనల నుండి గాని ఈ భాగము క్రింద చేసిన ఏవేని నియమముల నుండిగాని మినహాయించవచ్చును .

భాగము 3.

చలనచిత్రముల ప్రదర్శనలను క్రమబద్దము చేయుట.

10. ఈ భాగములోని నిబంధనలు వేరు విధముగా ఉన్ననే తప్ప, ఏ వ్యక్తి యు చలనచిత్రములను ఈ భాగము క్రింద లైసెన్సు ఈయబడిన స్థలములొకాక మరెచ్చటను లేక అట్టి లెసెన్సు ద్వారా విధించిన ఏవేని షరతులను, నిర్భంధనలను పాటించకుండ ఇతర విధముగా, ప్రదర్శించరాదు.

11. జిల్లా మేజిస్ట్రేటు ఈ భాగము క్రింద లైసెన్సులనిచ్చుటకు అధికారము గలిగియున్న ప్రాధికారి (ఇందు ఇటు పిమ్మట లైసెన్సు ఇచ్చు ప్రాధికారి అని పేర్కొన బడిన) అయి ఉండును \:

అయితే, రాజ్యప్రభుత్వము , రాజపత్రములో అధిసూచన ద్వారా సంఘ రాజ్య క్షత్రమంతటికి గాని దానిలో ఏదేని భాగమునకుగాని తాము అధిసూచనలో నిర్దిష్టపరచు నట్టి ఇతర ప్రాధికారిని, ఈ భాగము నిమిత్తము లైసెన్సు ఇచ్చు ప్రాధికారిగా ఏర్పాటు చేయవచ్చును.

12. (1) లైసెన్సు ఇచ్చు ప్రాధికారి , -

(ఏ) ఈ భాగము క్రింద చేసిన నియమములను చాలవరకు పాటించినారనియు,

(బీ) ఏ స్థలమునకు సంబంధించి లైసెన్సు ఈయవలసియున్నదో ఆ స్థలములో జరుగు ప్రదర్శనలకు హాజరగు వ్యక్తుల భద్రతకొరకు *[1]పర్యాప్తమైన ముందు జాగ్రత్తలు తీసుకొనినారని,

తాను అభిప్రాయపడిననే తప్ప, ఈ భాగము క్రింద లైసెన్సు ఈ యరాదు.

(2) ఈ పరిచ్ఛేదములోని పై నిబంధనలకును రాజ్యప్రభుత్వ నియంత్రణకును లోబడి , లైసెన్సు ఇచ్చు ప్రాధికారి ఈ భాగము కింద లెసెన్సులను తాను సబబని తలచునట్టి వ్యక్తులకు , మరియు తాను నిర్దారణచేయు నట్టి నిబంధనలు , మరియు షరతులప్పెనను , అట్టి నిర్భంధనలకు లోబరచియు ఈయవచ్చును.

  1. *చాలినన్ని