పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

208- 0 2 /6-806 (3) ఈ భాగము క్రింద ఏదేని లైసెన్సును నిరాకరించుచు లైసెన్సు ఇచ్చు ప్రాధికారి చేసిన నిర్నయము వలన వ్యధితుడైన ఏ వ్యక్తి యైనను , విహితపరచినట్టి కాలావధిలోపల రాజ్య ప్రభుత్వమునకుగాని, ఈ విషయమున రాజ్యప్రభుత్వము నిర్దిష్ట పరచునట్టి అధికారికిగాని అపీలు చేసుకొనవచ్చును . మరియు సందర్భానుసారముగా రాజ్యప్రభుత్వము లేక అధికారి ఆ కేసులో తాను సబబని తలచు నట్టి ఉత్తరువు చేయవచ్చును.

(4) కేంద్ర ప్రభుత్వము, వైజ్నానిక ఫిల్ములను, విద్యావిషయక ప్రయోజనములకై ఉద్దేశించిన ఫిల్ములను, వార్తలకు, వర్తమాన సంఘటనలకు సంబంధించిన ఫిల్ములను , డాక్యుమెంటరీ ఫిల్ములను లేక దేశీయ ఫిల్ములను ప్రదర్శించుటకు *[1]పర్యాప్తమైన అవకాశము ఉండునట్లు ఏదేని ఫిల్ము యొక్క లేక ఏదేని కోవకు చెందిన ఫిల్ముల యొక్క ప్రదర్శనను క్రమబద్దము చేయుటక్కె ఆయా సమయములందు , సాధారణముగా లైసెన్సుదార్లకుగాని ప్రత్యేకముగా ఎవరేని లైసెన్సుదారుకుగాని ఆదేశములను జారీచేయవచ్చును . ఏవేని అట్టి ఆదేశములను జారీచేసినయెడల, ఆ ఆదేశములను లైసెన్సు ఇచ్చుటకు లోబరచిన అదనపు షరతులుగను మరియు నిర్భంధ నలుగను భావించవలెను.

13. (1) సంఘ రాజ్యక్షేత్రమంతటికి లేక అందలి ఏదేని భాగమునకు సంబంధించి లెఫ్ట్ నెంట్- గవర్నరు. లేక సందర్భానుసారముగ చీఫ్ కమీషనరు , మరియు జిల్లా మేజిస్ట్రేటు అధికారితా పరిధిలోని జిల్లాకు సంబంధించి ఆ జిల్లా మేజిస్ట్రేటు, సార్వ జనికముగా ప్రదర్శింపబడుచున్న ఏదేని ఫిల్ము బహుశ: శాంతిభంగము కలిగించగలదని తాను అభిప్రాయపడినచో, ఉత్తరువు ద్వారా, ఆ ఫిల్ము ప్రదర్శనను నిలిపివేయవచ్చును; అట్టి నిలుపుదల కాలములో ఆ ఫిల్మును, సందర్భానుసారముగ ఆ రాజ్యము, భాగము లేక జిల్లా యందు ధ్రువీకరించని ఫిల్ముగా భావించవలెను.

(2) ఉపపరిచ్ఛేదము (1) క్రింద ఉత్తరువును సందర్భానుసారముగ చీఫ్ కమీషనరు లేక ఒక జిల్లా మేజిస్ట్రేటు జారీచేసినయెడల, దానికి గల కారణముల వివరణతో సహా ఆ ఉత్తరువు నకలును, ఆ ఉత్తరువుచేసిన వ్యక్తి, తక్షణమే కేంద్ర ప్రభుత్వమునకు పంపవలెను; కేంద్ర ప్రభుత్వము ఆ ఉత్తరువును ఖాయపరచవచ్చును లేదా రద్దు చేయవచ్చును .

(3) ఈ పరిచ్చేదము క్రింద చేసిన ఉత్తరువు, దాని తేదీ నుండి రెండు మాసముల కాలావధి వరకు అమలులో నుండును, కాని కేంద్ర ప్రభుత్వము, ఆ ఉత్తరువు అమలులోనుండుట కొనసాగవలెనని అభిప్రాయపడినచో, ఆ నిలుపుదల కాలావధిని తాము సబబని తలచు నట్టి అదనపు కాలావధి వరకు పొడిగించవలెనని ఆదేశించ వచ్చును.

14. ఏదేని చలనచిత్రపు సొంతదారుగాని, దాని బాధ్యతగల వ్యక్తి గాని దానిని, ఈ భాగము యొక్క లేక ఈ భాగము క్రింద చేసిన నియమముల యొక్క నిబంధనలను , లేక ఈ భాగము క్రింద ఏదేని లైసెన్సు ఏ షరతులకు మరియు నిబంధనలకు లోబరచి ఈ యబడినదో ఆ షరతులను, నిర్భంధనలను ఉల్లంఘించి ఉపయోగించుచో, లేక అట్లు ఉపయోగించనిచ్చుచో లేక ఏదేని స్థలము సొంతదారుగాని ఆక్రమణదారుగాని ఆ స్థలమును సదరు నిబంధనలను, షరతులను, నిర్భంధనలను ఉల్లంఘించి ఉపయోగించుటకు అనుమతించుచో అతడు వేయి రూపాయల దాక ఉండగల జుర్మానా తోను, మరియు ' కొనసాగుచుండు అపరాధమెన సందర్భములో, ఆ అపరాధము కొనసాగుచున్న కాలములో ప్రతి దినమునకు వంద రూపాయల దాక ఉండగల అదనపు జుర్మానాతోను శిక్షింపదగియుండును .

  1. *చాలినంత.