పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

09 /6-803 (2) ఎవరేని వ్యక్తి ఏదేని ఫిల్ము విషయములో ఈ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగిన ఏదేని అపరాధమునకై, దోష స్థాపితుడైనచో, దోషస్థాపనచేయు న్యాయ స్థానము ఆ ఫిల్మును ప్రభుత్వము సమపహరణము చేయవలెనని ఆదేశించవచ్చును .

(3) ఒక "వ" ధ్రువపత్రము లేక "ప్ర" ద్రువపత్రము లేక "నిలేవ " ధ్రువ పత్రము పొందిన ఫిల్మును తల్లి దండ్రు లతోగాని సంరక్షకులతోగాని వచ్చు. మూడు సంవత్సరములలోపు వయస్సుగల పిల్లలకు ప్రదర్శించుటను ఈ పరిచ్ఛేదపు భావపరిధిలో అపరాధముగా భావించరాదు

7ఏ(1) ఈ చట్టము క్రింద ఎట్టి ధువపత్రమును పొందని ఫిల్మును "ప్రదర్శించినయెడల లేక వయోజనులకు మాత్రమే పరిమితము చేసి సార్వజనిక ప్రదర్శన నార్దము తగినదని ధ్రువీకరించిన ఫిల్మును వయోజనుడు. కాని ఎవరేని వ్యక్తికి ప్రదర్శించినయెడల , లేక ఏదేని ఫిల్మును ఈ చట్టములొని ఏదేని ఇతర నిబంధనను లేక తనకు ఒసగిన అధికారములలో దేనిన్నె నను వినియోగించి కేంద్ర ప్రభుత్వము , టిబ్యునలు లేక బోర్దు చేసిన ఏదేని ఉత్వరువును ఉల్లంఘించి ప్రదర్శించినయెడల, ఏ పోలీసు అధికారియైనను , ఏ స్థలములో ఆ ఫిల్మును ప్రదర్శించినారని, ప్రదర్శించు చున్నారని లేక ప్రదర్శించగలరని విశ్వసించుటకు తనకు కారణము కలదో అట్టి ఏదేని స్థలములో ప్రవేశించి దానిని సోదా చేయవచ్చును. మరియు ఆ ఫిల్మును అభిగ్రహించ వచ్చును

(2) ఈ చట్టము క్రింద సోదాలన్నింటిని క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 - ఆ లోని సోదాలకు సంబందించిన నిబంధనల ప్రకారము జరుపవలెను .

7.బీ (1) కేంద్ర ప్రభుత్వము సాధారణ లేక ప్రత్యేక ఉత్తరువు ద్వారాను, ఈ చట్టము క్రింద బోర్దు వినియోగించదగు ఏదేని అధికారమునుగాని, ప్రాధికారమును గాని అధికారితను గాని ఈ భాగము క్రింద ఫిల్ముల ధ్రువీకరణ విషయములోను ఆ ఉత్తరువులో నిర్విష్టపరచిన షరతులు ఏవేనిఉన్నచో వాటికి లోబరచియు బోర్డు చైర్మను లేక దాని ఎవరేని ఇతర సభ్యుడు కూడ వినియోగించవచ్చునని ఆదేశించవచ్చును; ఆ ఉత్తరువులో నిర్దిష్టపరచిన ఛైర్మను లేక ఇతర సభ్యుడు చేసినది ఏదియై నను లేక తీసికొనిన ఏ చర్యయ్నె నను బోర్దు చేసినదిగా లేక తీసికొనిన చర్యగా భావించవలెను .

(2) కేంద్ర ప్రభుత్వము ఉత్తరువు ద్వారాను విహితపరచు నట్టి షరతులకును ఆ నిర్బంధనలకును లోబడియు తాత్కాలిక ధ్రువపత్రమును జారీచేయుటకు ప్రాంతీయ అధికారులకు ప్రాధికారము నొసగవచ్చును.

7సీ. ఈ చట్టము ద్వారా తనకు ఒసగిన అధికారములలో దేనిన్నెనను వినియోగించుట కొరకు కేంద్ర ప్రభుత్వము , ట్రిబ్యునలు నుగాని, బోర్దునుగాని ఏదేని ఫిల్మును తమ సమక్షమున లేక ఈ విషయమున తాము , నిర్దిష్టపరచిన ఎవరేని వ్యక్తి లేక ప్రాధికారి సమక్షమున ప్రదర్శించవలెనని కోరవచ్చును .

7డీ- ట్రిబ్యునలు, బోర్దు లేక ఏదేని సలహా ప్యానలు యొక్క ఏ కార్యమును గాని, చర్యనుగాని సందర్భానుసారముగ ఆ ట్రిబ్యునలు, బోర్దు లేక ప్యానలులో ఏదేని ఖాళీ ఉన్నదను లేక దాని ఏర్పాటులో ఏదేని లోపము. ఉన్నదను కారణ మాత్రముననే శాసనమాన్యత లేనిదిగా భావించరాదు.

7ఈ ట్రిబ్యునలు, బోర్దు మరియు ఏదేని సలహా ప్యానలు సభ్యులందరిని ఈ చట్టమునందలి ఏవేని నిబంధనలననుసరించి వ్యవహరించునపుడు లేక వ్యవహరించుటకు చున్నట్లు తాత్సర్యమగునపుడు భారత శిక్షాస్మృతియొక్క 21వ పరిచ్ఛేదపు భావపరిధిలోని పబ్లికు సేవకులై నట్లు భావించవలెను.