పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8"/G-802}} ________________

(ii) వయోజనులకు మాత్రమే పరిమితముచేసి సార్వజనిక ప్రదర్శనార్దము తగినదని బోర్దు ధ్రువీకరించిన ఏదేని ఫిల్మును ఎవరేని వయోజనుడు కాని వ్యక్తికి,

(iiఏ) ఏదేని వృత్తికి లేక వ్యక్తుల వర్గమునకు మాత్రమే పరిమితము చేసి సార్వజనిక ప్రదర్శనార్దము తగినదని బోర్దు ధ్రువీకరించిన ఏదేని ఫిల్మును అట్టి వ్రుత్తికి చెందని లేక అట్టి వర్గమునకు చెందని వ్యక్తికి

ప్రదర్శించు లేక ప్రదర్శించుటకు అనుమతినిచ్చుచో, లేక

(బీ) ఏదేవి ఫిల్మును ధ్రువీకరించిన పిమ్మట శాసనసమ్మతమైన ప్రాధికారము (దానిని రుజువుచేయు భారము అతనిపై ఉండును) లేకుండ దానిని ఏ విధముగాన్నైనను మార్చుచో లేక అక్రమముగా దిద్దు చో, లేక

(సీ) పరిచ్ఛేదము 6ఏ లోని నిబంధనలను లేక కేంద్ర ప్రభుత్వముగాని బోర్దుగాని ఈ చట్టము ద్వారా లేక ఈ చట్టము క్రింద చేసిన నియమముల ద్వారా తనకు ఒసగిన అధికారములలో లేక కృత్యములలో వేటిన్నెనను వినియోగించుచు చేసిన ఏదేని ఉత్తరువును పాటించనిచో

అతడు మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కారావాసముతోను లేక ఒక లక్ష రూపాయల దాక ఉండగల జుర్మానాతోను లేక ఈ రెండింటితోను మరియు అపరాధము కొనసాగుచున్న సందర్భములో అట్టి అపరాధము కొనసాగుచున్న కాలములో ప్రతి దినమునకు ఇరవై వేల రూపాయల దాక ఉండగల అదనపు జుర్మానాతోను శిక్షింప దగియుండును:

అయితే, ఖండము (ఏ)లోని ఉప-ఖండము (1) యొక్క నిబంధనలను ఉల్లంఘించుచు ఒక వీడియో ఫిల్మును ఏదేని స్థలములో ప్రదర్శించు లేక ప్రదర్శించు టకు అనుమతినిచ్చు వ్యక్తి, మూడు మాసములకు తక్కువ కాకుండద అయితే మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కారావాసముతోను మరియు ఇరవైవేల రూపాయలకు తక్కువ కాకుండ అయితే లక్ష రూపాయల దాక ఉండగల జుర్మానాతోను మరియు అపరాధము కొనసాగుచున్న సందర్భములో అట్టి అపరాధము కొనసాగుచున్న కాలములో ప్రతి దినమునకు ఇరవైవేల రూపాయల దాక ఉండగల అదనపు జుర్మానా తోను శిక్షింపదగియుండును:

అంతేకాక, న్యాయస్ట్రానము , తీర్పులో పేర్కొనవలసిన *[1]పర్యాప్తమైన మరియు ప్రత్యేక కారణమును బట్టి మూడు మాసముల కంటే తక్కువ కాలావధికి కారావాస శిక్షను లేక ఇరవై వేల రూపాయల కంటే తక్కువ జుర్మానాను విధించవచ్చును:

అంతేకాక, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 29వ పరిచ్ఛేద ములో ఏమియున్నప్పటికినీ, ఈ విషయమున రాజ్యప్రభుత్వముచే ప్రత్యేకముగా అధికారము పొందిన ఎవరేని మహానగర మేజిస్ట్రేటు లేక ఎవరేని మొదటి తరగతి న్యాయిక మేజిస్ట్రేటు , ఈ భాగము క్రింద శిక్షింపదగు ఏదేని అపరాధమునకై దోష స్థాపితుదైన ఎవరేని వ్యక్తి పై ఐదువేల రూపాయలకు మించిన జుర్మానా దండనోత్తరువు చేయుట శాసనసమ్మతమ్మె యుండును:

అంతేకాక ఇంకను ఈ భాగము క్రింద "నిలేవ"గా ధ్రువీకరించిన ఫిల్ముపై, హెచ్చరికగల పీటీవ్రాతలోని ఏదేని షరతును ఉల్లంఘించినందులకు , పంపిణీదారుగాని ప్రదర్శకుడుగాని ఏదేని సినిమా హౌజ్ సొంతదారుగాని లేక ఉద్యోగిగాని శిక్షకు పాత్రుడు కాడు .

  1. *చాలినన్ని