పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

7 /6-801 రికార్దును ఏ దశయందై నను తమంతతాము తెప్పించి, ఆ విషయమున తాము ఆవశ్యకమని తలచు నట్టి పరిశీలన జరిపిన పిమ్మట దాని విషయములో తాము సబబని తలచు నట్టి ఉత్తరువు చేయవచ్చును; బోర్దు అట్టి ఉత్తరువుననుసరించి ఆ విషయమును పరిష్కరించవలెను:

అయితే, ధ్రువపత్రముకొరకు దరఖాస్తు పెట్టుకొనిన లేక సందర్భాను సౌరముగ ధ్రువపత్రము పొందిన ఎవరేని వ్యక్తికి ప్రతికూలమగునట్టి ఉత్తరువును దేనినీ ఆ విషయములో తన అభిప్రాయములను తెలియజేసుకొనుటకు అతనికి ఒక అవకాశము నిచ్చిన పిమ్మటనే తప్ప, చేయరాదు:

అంతేకాక ఈ ఉపపరిచ్ఛేదములో నున్నదేదియు, ప్రజాహితమునకు భంగకర మగునని తాము తలంచు నట్టి ఏదేని సంగతిని వెల్లడిచేయవలెనని కేంద్ర ప్రభుత్వమును కోరదు.

(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద తమకు ఒసగిన అధికారములకు భంగము లేకుండ కేంద్ర ప్రభుత్వము , రాజపత్రములో అధిసూచన ద్వారా, -

(ఏ) ధ్రువపత్రమును పొందిన ఏదేని ఫిల్మును, యావద్భారత దేశములో గాని అందలి ఏదేని భాగములోగాని ధృవపత్రము పొందని ఫిల్ముగా భావించవలెనని, లేక

(బీ) "నిలే" ధ్రువపత్రము లేక "నిలేవ" ధ్రువపత్రము లేక "ఏ" ధ్రువ పత్రము పొందిన ఏదేని ఫిల్మును , 'వ' ధ్రువపత్రము పొందిన ఫిల్ముగా భావించవలెనని; లేక

(సీ) ఏదేని ఫిల్మును ప్రదర్శించుటను ఆదేశములో నిర్దిష్టపరచినట్టి కాలావధి పాటు నిలుపుదల చేయవలెనని,

ఆదేశించవచ్చును:

అయితే, ఖండము (సీ) క్రింద జారీచేసిన ఆదేశమేదియు, అధిసూచన తేదీ నుండి రెండు మాసములకు మించి అమలులో ఉండరాదు.

(3) ఉపపరిచ్ఛేదము (2) లోని ఖండము (ఏ) లేక ఖండము (బీ) క్రింద ఎట్టి చర్యనుగాని ఈ విషయములో తన అభిప్రాయములను తెలియజేసికొనుటకు సంబం ధించిన వ్యక్తి కి ఒక అవకాశము ఇచ్చిన పిమ్మటనే, తప్ప తీసుకొనరాదు.

(4) ఉపపరిచ్ఛేదము (2)లోని ఖండము (సీ) క్రింద ఏదేని . ఫిల్మును నిలుపుదల చేసిన 'కాలావధిలో ఆ ఫిల్మును ధ్రువపత్రము పొందని ఫిల్ముగా భావించవలెను.

6ఏ. ధ్రువీకరించిన ఏదేని ఫిల్మును ఎవరేని పంపిణీదారుకుగాని ప్రదర్శకునకు గాని ఇచ్చు ఎవరేని వ్యక్తి, ఆ ఫిల్ము పేరును, నిడివిని, దాని విషయములో ఇచ్చిన ధ్రువపత్రపు స్వభావమును, సంఖ్యను, అది అట్లు ఏ షరతులకు లోబరిచి ఈయడమ్నెనదో ఆ షరతులను, మరియు ఆ ఫిల్ముకు సంబంధించి విహితపరచదగు ఏవేని " ఇతర వివరములను పంపిణీదారుకు లేక సందర్భానుసారముగ ' ప్రదర్శకునకు విహితపరచదగిన రీతిగా తెలియజేయవలెను.

7. (1) ఎవరేని వ్యక్తి,

(ఏ) ఏదేని స్ఠలములొ

(i) నిర్భంధనలేవియు లేకుండ సార్వజనిక ప్రదర్శనార్దము లేక వయోజను లకు లేక ఏదేని వృత్తికి చెందినవారికి లేక వ్యక్తుల వర్గమునకు మాత్రమే పరిమితము చేసి సార్వజనిక ప్రదర్శనార్దము తగినదని బోర్దు ధ్రువీకరించిన ఫిల్ము అయియుండి దానిని ప్రదర్శించినపుడు బోర్దు విపాతపరచిన గుర్తును చూపునదియు దానికి అట్టి గుర్తు పెట్టినప్పటి నుండి ఏ విధముగను మార్చబడనిదియు లేక అక్రమముగా దిద్దబడ నిదియు కానట్టి ఏదేని ఫిల్మును,