పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

కృష్ణమూర్తి తత్వం

మీద మనకే విపరీతమైన అసంతృప్తిగా వుంది; మనల్ని ధ్వంసం చేస్తున్న, సతతం నమిలివేస్తున్న యీ అసంతుష్టిని తృప్తి పరచాలనీ, దానిని మించి ఆవలగా పోవాలనీ కోరుకుంటుంటాం. మనలోని యీ అసంతుష్టి దేనీకోసం? అసంతుష్టిని చాలో సులభంగా తృప్తి పరచవచ్చని నాకు తెలుసు. అసంతుష్టిలో పడిపోయిన ఒక యువకుడికి. అతను కమ్యునిస్టు అవచ్చు, విప్లవకారుడు కావచ్చు- మంచి ఉద్యోగం ఒకటి యిస్తే అన్నీ మరిచిపోతాడు. చక్కని యిల్లు యివ్వండి, మంచి కారు, అందమైన తోట, అంతస్తు యిస్తే అతనిలోని అసంతృప్తి ఆదృశ్యమవడం గమనిస్తారు. ఒక వేళ సిద్ధాంత పరమైన విజయం లభించినా కూడా అతనిలోని అసంతుష్టి అదృశ్య మవుతుంది. అయితే మీలో అసంతుష్టి ఎందుకు కలిగింది అనే ప్రశ్న మీరు ఎన్నడూ వేసుకోరు- అంటే చిన్న వుద్యోగాల్లో వుండి గొప్ప వుద్యోగాలు కాపాలనుకునేవారి గురించి కాదు యిది. సుఖమూ, దాని మొత్తం స్వరూపమూ, దాని అర్థమూ, దీని ద్వారా దుఃఖం గురించి పరీక్షించాలంటే ముందుగా అసంతుష్టికి మూలకారణం ఏమిటో తెలుసుకోపోలి.

సర్! చూడండి, పారశాల రోజుల నుంచి చనిపోయేవరకు పోల్చిచూడటంలోనే మన చదువు, మన నిబద్దీకరణం సాగుతాయి. మరొకరితో నన్ను నేను పోల్చిచూసుకుంటాను. మిమ్మల్ని మీరే జాగ్రత్తగా గమనించండి. నేను చెప్తున్నది శ్రద్ధగా వింటూ, మీ మనసు ఎట్లా పనిచేస్తున్నదో పరికించండి. మీ మీద రెండు బాధ్యతలు వున్నాయి. వక్త చెప్తున్నది వినడమే కాకుండా, ఆ వింటున్నప్పుడు యదార్థంగా మీ మానసిక స్థితిగతులు ఏమిటో కూడా పరిశీలించాలి. అందుకని మీలో ఒక సావధానత వుండాలి. వక్తను గురించి, అతను చెప్తున్నదానిని గురించి కూడా ఎరుకగా వుండాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ వుండాలి. అయితే, మీరు కనుక యదార్థంగా వింటున్నట్లవుతే- అంటే అవగాహన చేసుకోవాలని ప్రయత్నించడం కాదు, వక్త వుపన్యసిస్తున్నదానిని మీకు అన్వయించుకోవడం కాదు, నిందించడం కాదు, సర్దుబాటు చేసుకోవడం కాదు, నిరాకరించడమో, అంగీకరించడమే కాదు- అట్లా వింటున్నప్పుడు వక్త అనే ఒకరు కానీ, మీరు కానీ లేనేలేరనీ, కేవలం వాస్తవం మాత్రమే, అంటే 'వున్నది' అనేది మాత్రమే వున్నదని మీరు తెలుసుకుంటారు. అదీ వినడం అనే కళ, వక్త చెప్పేది కానీ, మీ స్వంత అభిప్రాయాలను, నిర్ణయాలను కాని వినడం కాదు, 'యదార్ధంగా వున్నది' ని వినడం. మనం ఎప్పుడూ మరొకరితో మనల్ని పోల్చి చూసుకుంటూ వుంటాం. నేను మందకొడిగా కనుక వుంటే, బాగా చురుకైన వాడిని అవాలని కోరుకుంటాను. నేను కనుక వట్టి డొల్ల మనిషినవుతే గంభీరంగా అవాలనుకుంటాను; ఏమీ తెలియని అజ్ఞానినవుతే చాలా తెలివిగా వుండాలి,