Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసంగాలు

53

జ్ఞానం సంపాదించాలి అని కోరుకుంటాను. ఎప్పుడూ యితర్లతో నన్ను పోల్చి చూసుకుంటూ, యితరులతో పోల్చుకొని, నన్ను తూకం వేసుకుంటూ వుంటాను. వారి కారుని మించిన కారు, వారికంటే మంచి ఆహారం, వారిని మించిన యిల్లు, వారి కంటే మంచి ఆలోచనా విధానం, అట్లాగ. పోల్చి చూడటం అనేది సంఘర్షణను పెంచి పోషిస్తుంది. అసలు పోల్చిచూడటం ద్వారా అవగాహన కలుగుతుందా? రెండు సంగీత స్వరాలను, రెండు సూర్యాస్తమయాలను పోల్చి చూసినప్పుడు, ఒక వృక్షాన్ని మరో వృక్షంతో పోల్చి చూసినప్పుడు, వాటిలో ఒక్కటయినా అర్ధమవుతుందా? పోల్చి చూడటం అనేది ఏమాత్రం లేనప్పుడే ఒక విషయం మనకి అర్థమవుతుందా?

కాబట్టి, ఏ రకమైన పోల్చిచూడటమూ లేకుండా, మరొక వ్యక్తితో గాని, ఒక భావంతోగానీ, ఒక ఆదర్శ పురుషునితోకాని, ఒక దృష్టాంతంతోకాని పోల్చుకోవడానికి అనుగుణంగా మిమ్మల్ని సరిదిద్దుకోవడం అన్నది లేనేలేకుండా జీవించడం సాధ్యమేనా? ఎందుకంటే పోల్చిచూస్తున్నప్పుడు, 'యిక ముందు ఎట్లా వుండాలి' లేదా 'ఒకప్పుడు ఎట్లా వుండింది? అన్నదానితో పోల్చి మిమ్మల్ని తూకం వేసుకుంటున్నప్పుడు, యిప్పుడు 'వున్నది' ఏమిటో దానిని మీరు చూడటం లేదు. దయచేసి వినండి. ఇది చాలా సరళంగానే వుంటుంది. అందువల్లనే, అతిచాతుర్యమూ, అతి జిత్తుల మారితనమూ వున్న మీకు బహుశ అది అందకుండా పోతున్నది. ఏ రకమైన పోల్చిచూడటమూ లేకుండా యీ ప్రపంచంలో జీవించడం సాధ్యం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము. సాధ్యంకాదు అని అనకండి. అసలు మీరెప్పుడూ ప్రయత్నించలేదు. 'నేను చేయలేను, అది అసాధ్యం; ఎందుకంటే పోల్చిచూడటం అనేది నా నిబద్దతలో ఒక ప్రధాన భాగం' అని మీరు అనరు. తరగతి గదిలో ఒక పిల్లవాడిని మరోక పిల్లవాడితో పోలుస్తారు. 'అతనంత తెలివిగా నీవు లేవు' అని అధ్యాపకుడు అంటాడు. “బి” అనేవాడిని ‘ఎ’ తో పోల్చినపుడు 'బి' ని అధ్యాపకుడు నాశనం చేస్తున్నాడన్నమాట. జీవితమంతా యిదే పద్ధతిలో కొనసాగుతూ వుంటుంది.

అభివృద్ధికి, అవగాహనకీ, మేధోపరమైన వికాసానికీ పోల్చిచూడటం అత్యావశ్యక మని మీరు అనుకుంటారు. కాని, అవసరం లేదు అని నాకనిపిస్తున్నది. ఒక చిత్రంతో మరొక చిత్రాన్ని పోల్చిచూస్తున్నప్పుడు ఏ ఒక్కదాన్నీ మీరు సరిగ్గా చూడటంలేదు. పోల్చడం లేనప్పుడు ఒక్కదానివంకే మీరు చూడగలుగుతారు. కాబట్టి, యిదే పద్దతిలో, మరొకరితో మిమ్మల్ని మానసిక పరంగా పోల్చిచూడటం అనేది జీవితంలో ఎప్పటికీ లేనేలేకుండా జీవించడం సాధ్యమేనా? రాముడితో కాని, గీతతోకాని, సీతతోకానీ, ఎవరితోనయినా సరే; నాయకుడితో, మీ దేవుళ్ళతో, మీ ఆదర్శాలతో బొత్తిగా పోల్చి చూసుకోకుండా వుండటం, పోల్చి చూడటం- ఏ స్థాయిలోనైనా సరే లేనేలేని మనసు