పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

కృష్ణమూర్తి తత్వం

మొదలైనవి గల ప్రపంచం యిది. ప్రపంచం ఏమిటో- అది యిట్లా వుండాలి అని మనం వూహించేది కాదు. యదార్ధంగా ఏమిటో తెలుసుకున్నాక, దానిలో ఒక సమూలమైన పరివర్తన తీసుకొనిరావడమే మన బాధ్యత. ఆ పరివర్తన తీసుకొని రావాలంటే మనిషి మెదడులో బ్రహ్మాండమైన మ్యుటేషన్ అంటే వుత్పరివర్తనం జరగాలి; అయితే ఏ విధమైన భయం వున్నా యిా పరివర్తన జరగదు.

అందువల్ల, 'మనం పూర్తిగా, పరిపూర్ణంగా జీవించడానికిగాను ఆలోచనను అంతమొనరించడం సాధ్యమా' అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. మీ రెప్పుడైనా గమనించారా, సంపూర్ణమైన సావధానంతో మీరు వున్నప్పుడు, మీ ధ్యాసనంతా పరిపూర్ణంగా ఒకదానికి యిచ్చినప్పుడు, పరిశీలించేవాడు వుండడనీ, కాబట్టి ఆలోచించేవాడూ వుండడని; ఒక కేంద్రస్థానం వుండటం, అక్కడినుండి 'మీరు' పరిశీలిస్తూ వుండటం వుండదని? ఎప్పుడయినా చేసి చూడండి. పూర్తి సావధానత్వంతో వుండండీ- 'ఏకాగ్రత' కాదు. 'ఏకాగ్రత' తో వుండటం అనేది బొత్తిగా అర్థంలేని ఒక ఆలోచనా ప్రక్రియ, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. పారశాలలో చదువుకొనే చిన్న పిల్లవాడు కూడా యిది చేయగలడు; మనం ప్రస్తావించుకుంటున్నది 'సావధానశీలత్వం' గురించీ- అంటే సావధానంగా వుండటం. ఇప్పుడు మీరు కనుక మీ మొత్తం అస్తిత్వంతో, మీ మనసుతో, మీ మెదడుతో, మీ నరాలతో, సంపూర్ణమైన మీ శక్తితో కనుక వింటున్నట్లవుతే - వినడం మాత్రమే; అంగీకరించడం కాదు, విభేదించడం కాదు, పోల్చి చూడటం కాదు, అసలైన సంపూర్ణమైన సావధానతలో వినడం- అప్పుడు వింటూవున్న, పరిశీలిస్తూ వున్న ఒకరు వున్నారా? పరిశీలకుడు అనేవాడు లేనేలేడని మీరు కని పెడతారు. సరే, ఒక చెట్టువైపు మీరు చూస్తున్నప్పుడు, సంపూర్ణమైన సావధానతతో చూడండి. ఇక్కడ ఎన్నో వృక్షాలు వున్నాయి, వాటివైపు చూడండి. సాయంకాలాల్లో కాకులు గూళ్ళు చేరుతున్న శబ్దాలను వింటున్నప్పుడు, వాటిని సంపూర్ణంగా వినండి. 'నాకు ఆ ధ్వనులు యిష్టం' అని కానీ, 'నాకు ఆ ధ్వనులు యిష్టంలేదు' అని కానీ ఆనకండి. మీ హృదయంతో, మీ మనసుతో, మీ బుద్ధితో, మీ నరాలతో వినండి, సంపూర్ణంగా, అదే విధంగా, ఆలోచన మధ్యలో కలుగ చేసుకొనడం అనేది లేకుండా చెట్టును చూడండి - అంటే అర్ధం పరిశీలకుడికి, పరిశీలిస్తున్న విషయానికీ నడుమన ఎడం లేదని, అటువంటి మొత్తమైన, సంపూర్ణమైన సావధానత వున్నప్పుడు, పరిశీలకుడు అనే వాడు వుండడు. ఈ పరిశీలకుడే భయానికి వూపిరిపోసి పోషిస్తాడు. ఎందుకంటే యీ పరీశీలకుడు ఆలోచనలకు కేంద్రస్థానం; అదే యీ 'నా', యీ 'నేను', 'స్వార్ధం', యీ 'అహం' అనేది. ఈ పరిశీలకుడే తనకి నచ్చని వాటిని కత్తిరించి వేస్తూ వుంటాడు. అయితే నేను చెప్తున్న ఆ స్థితి ఏమీ