ప్రసంగాలు
15
లేని స్థితి కాదు. అది తెలుసుకోవాలంటే దేనీనీ ఆమోదించకుండా చాలా లోతుగా శోధించ వలసిన అవసరం వుంటుంది.
చూడండి, మీరు మీ జీవితకాలమంతా ఆమోదిస్తూనే గడుపుకొస్తున్నారు. సంప్రదాయాన్ని ఆమోదించారు; సమాజాన్ని వున్నదాన్ని వున్నట్లుగా ఆమోదించారు. అన్నీంటికీ 'అవును' 'అవును' అనీ తలవూపే ప్రాణి మీరు, అంతే. వీటిలో ఏ ఒక్కదానినీ ఏనాడూ మీరు కాదనలేదు. కాదు అని మీరు అన్నా అది కేవలం తిరుగుబాటు మాత్రమే. తిరుగుబాటు కూడా తనదైన ఒక పద్దతిని తయారు చేసుకుంటుంది. అదే మళ్ళీ అలవాటుగా, ఆచారంగా అయిపోతుంది. అయితే, సమాజ నిర్మాణం సమస్తాన్నీ కనుక మీరు అర్ధంచేసుకున్నట్లవుతే, అది సంఘర్షణలు, పోటీలు, దేవుడి పేరో, దేశం పేరో, శాంతి పేరో చెప్పుకొని దయాదాక్షిణ్యాలు లేకుండా స్వార్ధాన్ని పెంచుకోవడం మొదలైన వాటి మీద ఆధారపడి వున్నట్లు గ్రహిస్తారు.
కాబట్టి భయాన్నుండి విముక్తి పొందాలంటే సంపూర్ణమైన సావధానత వుండాలి. ఈ సారి మీ మనసులో భయం ఆవరించుకుంటున్నప్పుడు- ఏం జరగబోతోందో అనే భయమో, మునుపు జరిగినదేదో మళ్ళీ తిరిగిరావచ్చుననే భయమో ఆవరిస్తున్నప్పుడు దానికి మీ సంపూర్ణమైన సావధానతను యివ్వండి. దానినుండి పారిపోకండి, దానిని మార్చాలని చూడకండి, దానిని అణచివేయాలని ప్రయత్నించ కండి, దానిని అదుపులో పెట్టాలనీ ప్రయత్నించకండి, పూర్తిగా, సంపూర్ణంగా, మీ మొత్తం సావధానత అంతటితోనూ దానితోటే వుండిపోండి, అప్పుడు, పరిశీలకుడు అనేవాడు లేకపోవడంవల్ల భయం కూడా లేదని మీరు గ్రహిస్తారు.
మనలో వుండే విచిత్రమైన భ్రాంతుల్లో ఒకటి ఏమిటంటే అంతఃచేతన అనేది ఒకటి లోపల ఎక్కడో లోతుగా పాతుకొని పోయివున్నదనీ, దానిలో నుండి రకరకాల భయాలు బయటకు వస్తుంటాయనీ అనుకోవడం. అర్థమైందా? చేతనా వర్తం అంతటికీ కొన్ని పరిమితులున్నాయి. ఈ పరిమితులుగల చేతనకు, నిబద్ధీకరణం చెందిన యీ సత్వానికి ఆవలగా పోవాలంటే దానిని 'చేతన' గాను 'అంతఃచేతన' గాను విభజించడం వల్ల ఏ మాత్రం లాభం లేదు. ఉన్నది చేతనావర్తం మాత్రమే; వర్తమాన క్షణంలో కనుక మీరు సంపూర్ణమైన సావధానతతో వుంటే, అప్పుడు మీరు అంతఃచేతనను, పరిమితులుగల చేతననూ కూడా తుడిచిపెట్టి వేయగలుగుతారు.
సావధాన శీలతను అలవరచుకోవడం సాధ్యం కాదు. సావధానతను సంపాదించడానికి ఒక పద్ధతిగాని, ఒక విధానంగానీ, ఒక శిక్షణగానీ లేదు. ఎందుకంటే సావధానంగా వుండటం కోసం ఒక పద్ధతిని మీరు అవలంబించారంటే, పరధ్యానాన్ని అలవరచుకుంటున్నారన్న మాట. ఇక్కడ మీరు పరధ్యానంగా వుండటం ద్వారా