Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

13

లేకపోతే భయం అట్లాగే కొనసాగుతుంది కదా?” అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఆ తరువాత, “ఎందుకు నేను భవిష్యత్తును గురించి ఆలోచిస్తాను? రేపును గురించి ఎందుకు ఆలోచిస్తాను?” అనో, “ఎందుకు నిన్న పడిన బాధను గురించో, నిన్నటి సుఖాన్ని గురించో నేను ఆలోచిస్తాను?” అనో నన్ను నేను ప్రశ్నించుకుంటాను.

దయచేసి నెమ్మదిగా వినండి; ఆలోచన భయాన్ని సృష్టిస్తుందని మనకు తెలుసు. ఆలోచన విధుల్లో ఒకటి ఏమిటంటే నిరంతరం వ్యాపకంతో వుండటం, ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ వుండటం. ఒక గృహిణి ఆహారాన్ని గురించి, పిల్లలు, బట్టలుతకడం ఇవన్నీ ఆమె వ్యాపకాలు- వీటిని గురించే ఎప్పుడూ ఆలోచిస్తున్నట్లు. ఆ వ్యాపకాలు తీసివేయండి, ఆమె ఆయోమయంలో పడిపోతుంది, పూర్తిగా సుఖశాంతులు కోల్పోయి, ఒంటరి తనంతో బోధపడుతుంది. దేవుడిని పూజించే మనిషి వద్ద నుండి, దైవభక్తితో పూర్తిగా నిండిపోయిన మనిషి వద్ద నుండి దేవుడిని తీసెయ్యండి; ఆతను పూర్తిగా అయోమయంలో పడిపోతాడు. కాబట్టి ఆలోచన ఏదో ఒక దానిని గురించిన వ్యాపకంతో వుండాలి. అది తనని గురించి కానివ్వండి, రాజకీయాల గురించి కానివ్వండి; ఒక విభిన్నమైన ప్రపంచాన్ని, ఒక కొత్త సిద్ధాంతాన్ని తయారుచేయడం ఎట్లా అనేదానితోకానీ, మరొకదానితో కానీ, ఈ మనసుకి వ్యాపకం పుండాలి. మనలో చాలా మందిమి వ్యాపకం వుండాలనే కోరుకుంటాం. లేకపోతే ఆయోమయంలో పడిపోతాం; లేకపోతే ఏం చేయాలో మనకి తోచదు, ఒంటరిగా వున్నట్లు అనిపిస్తుంది, నిజంగా మనం ఏమిటో అది ఎదురుగా నిలబడి మనల్ని నిలదీస్తుంది. ఆర్థం అయిందా? అందువల్ల మీరు వ్యాపకంలో వుంటారు, ఆలోచన వ్యాపకాన్ని పెట్టుకుంటుంది. ఇది మీ వైపుకి మీరు, యదార్థంగా మీరు ఏమిటో దాని వైపుకి చూసుకోకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది.

ఒక విభిన్నమైన ప్రపంచాన్నీ, ఒక విభిన్నమైన సాంఘిక క్రమాన్ని తీసుకొని రావాలని మనం ఆపేక్షిస్తున్నాం. మన అక్కర మత విశ్వాసాలను గురించి కానీ, అంధాచారాలను గురించి కానీ, మూఢ నమ్మకాలను గురించి కానీ కాదు. నిజమైన మతం అంటే ఏది అనే దాన్ని గురించి, అది తెలుసుకోవాలంటే భయం వుండకూడదు. ఆలోచనే భయానికి ఆలవాలమని, ఆలోచనకు ఏదో ఒక వ్యాపకం వుండాలని, లేని పక్షంలో తాను అయోమయంలో వున్నట్లుగా అనుకుంటుందని మనం గ్రహించాం. దేవుడు అనే వ్యాపకాన్ని, సంఘసంస్కరణ మొదలైనవి వ్యాపకాలుగా పెట్టుకోవడానికి ఒక కారణం ఏమిటంటే ఒంటరిగా వుండాలంటే మనకి భయం కనుక, మన లోపల ఖాళీగా వుంటే మనం భయపడతాం కనుక. ప్రపంచమంటే ఏమిటో మనకి తెలుసు: క్రూరత్వం, వికృతత్వం, హింస, యుద్ధాలు, వైషమ్యాలు, వర్గ, జాతి విభేదాలు