పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

కృష్ణమూర్తి తత్వం

చర్చతో వోదార్పు చెందాలనుకుంటున్నారా? మీకు తృప్తి కలిగించే కొన్ని మాటల ఆసరాతో దుఃఖాన్ని మరిచిపోవాలనుకుంటున్నారా?

'దీన్ని గురించి లోతుగా వెళ్ళి చూడాలనుకుంటున్నాను. అయితే మీరు చెప్పబోయేదానిని విని తట్టుకునే సామర్థ్యం కాని, బలంకాని నాకు వున్నాయా అని సందేహిస్తున్నాను. మావారు బతికున్న రోజుల్లో మీ ప్రసంగాలు వినడానికి అప్పు డప్పుడు వస్తుండేవాళ్ళం. కానీ యిప్పుడు మీరు చెప్పేది అర్థంచేసుకోవడం నాకు చేతనవుతుందో లేదో' అని ఆమె జవాబిచ్చారు.

మీలో దుఃఖం ఎందుకు వుంది? దానిని సమర్థిస్తూ కారణాలు వివరించకండి. ఎందుకంటే అదంతా మీ మనోభావాలను మాటల్లో పేర్చి చెప్పడం అవుతుందే తప్ప అసలు వాస్తవం కాదు. అందుకని మేము ప్రశ్న అడిగినప్పుడు దయచేసి సమాధానం చెప్పకండి. ఊరికే వినండి. వీని మీ అంతట మీరే తెలుసుకోండి, ఈ మరణం అనే దుఃఖం ఎందుకు వున్నది- పేద వారికి, గొప్ప వారికి; బాగా అధికారబలం వున్నవాళ్ళకు, బిచ్చగాళ్ళకూ, ప్రతి యింట్లోనూ? మీరెందుకు దుఃఖిస్తున్నారు? మీ భర్త కోసమా లేక మీ కోసమేనా? అతని కోసమే గనుక దుఃఖిస్తుంటే, మీ కన్నీళ్ళు అతనికేమైనా సహాయం చేయగలవా? ఆయన పోయారు, యింక తిరిగిరారు. మీరు ఏంచేసినా సరే, అతను మళ్ళీ మీవద్దకు ఎన్నడూ తిరిగి రాలేదు. కన్నీళ్ళు కాని, నమ్మకాలు కాని, కర్మకాండలు కాని, దేవుడు కాని అతన్ని తిరిగి తీసుకొని రాలేవు. మీరు ఒప్పుకొని తీరవలసిన వాస్తవం అది. ఈ విషయంలో మీరు యింకేమీ చేయలేరు. కాని, ఒకవేళ మీరు ఏడుస్తున్నది మీ కోసమే అయితే, మీ ఒంటరితనం, మీ శూన్యజీవితం, మీరు పొందిన యింద్రియ సుఖాలు, మీ సన్నిహిత స్నేహం తలుచుకొని మీరు ఏడుస్తుంటే, అప్పుడు మీరు ఏడుస్తున్నది నిజంగా మీ లోపలి శూన్యత్వం వల్ల, మీపై మీకే జాలివేయడం వల్ల. మీలో వున్న అంతర్గతమైన పేదరికం గురించిన స్పృహ కలగడం బహుశ యిదే మొట్టమొదటిసారి అనుకుంటా. మీ పెట్టుబడి అంతా మీ భర్తమీద పెట్టారు. అవునా కాదా? మృదువుగా చెప్పాలంటే యీ పెట్టుబడి మీద సౌఖ్యం, తృప్తి, సంతోషం మీకు లభించాయి. మీరు యిప్పుడు పడుతున్న బాధ అంతా ఆ వెలితి; ఒంటరితనం వల్ల, ఆందోళనల వల్ల కలిగిన మనోవ్యధ- యిదంతో ఒకరకంగా మీ మీద మీరు జాలిపడటమే; ఆవును కదూ? దానివైపు పరికించి చూడండి; అది చూసి హృదయాన్ని కరినం చేసుకోకండి. చేసుకొని, 'నేను నా భర్తని ప్రేమిస్తున్నాను, ఒక్క రవ్వంత కూడా నా గురించి ఆలోచించడం లేదు. అతన్ని కాపాడుకోవాలనుకున్నాను, తరచు అతని మీద అధికారం చేసింది కూడా యీ కారణంగానే. అయితే అదంతా అతని కోసమే. నా కోసం నేను ఎప్పుడూ