పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

కృష్ణమూర్తి తత్వం

ధ్యానం అంటే జీవితాన్ని వదిలేసి దూరంగా తొలగిపోవడం కాదు. ధ్యానం అంటే తనని తాను అవగాహన చేసుకొనే ఒక ప్రక్రియ. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవడం ఆరంభించినప్పుడు చేతనావర్తంలో వున్నదానినే కాకుండా, మీ లోపల ప్రచ్ఛన్నంగా వున్న అన్ని అంశాలనూ కూడా అవగాహన చేసుకుంటారు, అప్పుడు ప్రశాంతస్థితి కలుగుతుంది. ధ్యానం ద్వారా, నిర్బంధాల ద్వారా, లొంగదీసుకోవడం ద్వారా మనసుని నెమ్మది పరుస్తే, అది నిశ్చలస్థితి కాదు. అది నిలవవుండి పోయి, కుళ్ళిన మనసు. అప్రమత్తతో, సహనమూ వుండి, సృజనాత్మకమైన స్వీకారశీలతను సంతరించుకునే మనసు కాదు. మన స్వీయ అస్తిత్వపు స్థితిగతులను, ప్రచ్ఛన్నంగా లోపల వున్న వాటినీ, వుపరితలంలో వున్న వాటిని కూడా తేటతెల్లం చేసే ప్రతి మాట ఎడల, ప్రతి ఆలోచన, ప్రతి మనోభవం ఎడల నిరంతరమైన జాగరూకత, నిరంతరమైన ఎరుక ధ్యానానికి అవశ్యం వుండితీరాలి. ఇది మహా కరినతరమైనది కాబట్టి, మనకు హాయిగా, సౌకర్యంగా వుండే కపటమైన వాటిల్లోకి పారిపోయి, అదే ధ్యానం అని అనుకుంటాము.

ధ్యానానికి ఆరంభం స్వీయజ్ఞానమే అని కనుక మీరు గ్రహిస్తే, యీ సమస్య మహా ఆసక్తికరంగానూ, అత్యంత ప్రధానమైనదిగానూ అవుతుంది. ఎందుకంటే స్వీయజ్ఞానం కనుక లేకపోతే, ఒక ప్రక్కన ధ్యానం అని మీరు అనుకుంటున్నది చేస్తూనూ వుండచ్చు, మరో పక్కన మీ ఆదర్శసూత్రాల మీద, మీ కుటుంబంమీద, మీ ఆస్తిపాస్తులమీద మమకారబంధం పెంచుకోనూవచ్చు. ఒకవేళ ఆస్తిపాస్తులను వదులుకున్నా ఏదో ఒక సిద్ధాంతం మీద మమకారం పెంచుకుంటారు. ఆ సిద్ధాంతం మీదే బాగా కేంద్రీకరించి, దాన్ని యింకా, యింకా వృద్ధి చేసుకుంటారు. ఇది ధ్యానం కాదని నిస్సంశయంగా చెప్తున్నాను. కనుక, స్వీయజ్ఞానం ధ్యానానికి ఆరంభం. స్వీయజ్ఞానం లేకుండా ధ్యానం వుండదు. స్వీయజ్ఞానం అనే అంశాన్ని బాగా లోలోపలకు తరచి చూసిన కొద్దీ, పై పైన వున్న మనసు ప్రశాంతంగా, నెమ్మదిగా అవడమే కాకుండా, ప్రచ్ఛన్న మానసంలో పొరలుపొరలుగా దాగి వున్నవన్నీ వెల్లడవుతాయి. ఉపరితల మానసం నెమ్మళించగానే, అచేతన మానసం అంటే చేతనావర్తంలో దాగివున్న పొరలు పైకి ప్రదర్శితమవుతాయి. వాటిలో వున్న విషయం బయటకు వస్తుంది. వాటిని గురించిన సూచనలను అవి అందిస్తాయి. ఆ విధంగా మీ అస్తిత్వం అనే మొత్తం ప్రక్రియ అంతా పూర్తిగా అవగతమవుతుంది.

ఆవిధంగా మనసు అమోఘమైన ప్రశాంతిని పొందుతుంది. నెమ్మళిస్తుంది. నెమ్మదిగా చేయబడటం కాదు; భయపెట్టిగాని, ప్రతిఫలం చూపి కాని నెమ్మదిగా