Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందేహాలు, సమాధానాలు

107

చేస్తున్నప్పుడు మనసు నెమ్మదించడం కూడా నిజమే. కొన్ని కొన్ని వాక్యాలు మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేస్తుండటం వల్ల మనసు నెమ్మదిస్తుంది. ఆ నెమ్మదిలో ఏదయినా తెలిసిరావచ్చు, కొంత గ్రహింపు, కొంత స్పందన అందుకోవడం జరుగుతుంది. అయితే యిదంతా కూడా మనసు చేసే యింద్ర జాలంలోనిదే. ఎందుకంటే సమ్మోహపరచుకొనే పద్ధతి ద్వారా మనసుని చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చును. అటువంటి ప్రశాంతస్థితిలో అచేతన మానసంలో నుండీ, చేతన మానసానికి అవతల నుండీ ప్రచ్ఛనంగా వుండిపోయిన కొన్ని స్పందనలు బయటకు రావచ్చు. అయినా కూడా యీ స్థితి మనలో అవగాహన కలిగించే స్థితి మాత్రం కాదు.

సరే, ధ్యానం అంటే భక్తి కాదు. ఒక ఆలోచన మీదనో, ఒక బొమ్మ మీదో, ఒక ఆదర్శం మీద భక్తి నిలపడం ధ్యానం కాదు. ఎందుకంటే మనసుకి సంబంధించినవన్నీ కూడా విగ్రహారాధన కిందికి వస్తాయి. ఒక ప్రతిమను పూజించడం మాత్రమే విగ్రహారాధన అనీ, వెర్రితనమనీ, మూఢవిశ్వానమనీ మీరు అనుకోవచ్చు. కొని చాలామంది మనసులో పుట్టిన వాటిని కూడా పూజిస్తూ వుంటారు. ఇది కూడా విగ్రహారాధనే. ఒక బొమ్మకు కాని, ఒక ఆలోచనకు కాని, ఒక పరమగురువుకు కానీ భక్తి చూపడం ధ్యానం కాదు. అది నిస్సందేహంగా తననుంచి పారిపోవడానికి ఒక మార్గం. ఈ పారిపోవడం చాలా సుఖంగా వుంటుంది. అయినో కూడా ఆది పలాయనమే.

సత్పురుషులుగా మారాలనే యీ నిరంతర ప్రయాస, క్రమశిక్షణ ద్వారా, తనని తాను జాగ్రత్తగా పరీక్షించుకుంటూ వుండటం ద్వారా సద్గుణాలు సంపాదించాలను కోవడం- యివన్నీ కూడా ధ్యానం కాదు అని గట్టిగా చెప్పచ్చు. మనలో చాలామంది యీ ప్రక్రియల్లో చిక్కుకొని పోతారు. ఇవి మనల్ని గురించిన అవగాహనను మనకి కలిగించవు కాబట్టి సవ్యమైన ధ్యానానికి యివి మార్గాలు కావు. అసలు మిమ్మల్ని మీరు అర్థంచేసుకోకపోతే సవ్యంగా ఆలోచించడానికి మీకు ఆధారం ఎక్కడుంటుంది? స్వీయ అవగాహన లేనప్పుడు మీరు చేయగలిగిందల్లా ఏమిటంటే మీ వెనకాల వున్న నేపధ్యానికి, మీ నిబద్ధీకరణం కలిగించే స్పందనలకు లొంగిపోయి వుండిపోతారు. నిబద్దీకరణాన్ని బట్టి ప్రతిస్పందించడం ధ్యానం కాదు. అయితే యీ ప్రతిస్పందనలను గురించి ఎరుకగా వుండటంవల్ల, అంటే ఏ దూషణ భావమూ లేకుండా ఆలోచనల, మనోభావాల రాకపోకల ఎడల ఎరుకగా వుండటం వల్ల 'నేను' యొక్క తీరుతెన్నులు సంపూర్ణంగా అవగాహన అవుతాయి. అదే సవ్యమైన ధ్యానం చేసే మార్గం.