పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

కృష్ణమూర్తి తత్వం

ప్రస్తుత పరిస్థితుల్లో, ఒకే రకమైన పనులు ప్రతిరోజూ చేయడం, విసుగెత్తిపోవడం మనం భరించవలసి వస్తున్నది. అందుకని రకరకాల మార్గాల్లో పారిపోవడానికి ప్రయత్నిస్తూ వుంటాం. వినోద కాలక్షేపాలు, టెలివిషన్, రేడియో, పుస్తకాలు, మతం అనీ మనం పిలిచేది మొదలైన వాటిలోపడి పారిపోవాలని ప్రయత్నిస్తూ వుంటాం. అందువల్ల మన జీవితాలు డొల్లగా, శూన్యంగా, మందకొడిగా తయారవుతాయి. ఇట్లా డొల్లగా వుండటం వల్ల ఆధిపత్యానికి తలవంచడం పెరుగుతుంది. దానివల్ల మనం లోకంతో పాటు కలిసి వున్నామనే భావం, కొంతబలం ఒక స్థానం మనకి దొరుకుతాయి. ఇదంతా మనకు హృదయగతంలో తెలుస్తునే వుంటుంది. కాని యిందులో నుంచి బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే బయటపడాలంటే కావలసినది అతి సాధారణమైన భావోద్వేగంకాదు; దానికి అత్యంతంగా ఆవశ్యకమైనవి ఆలోచన, శక్తి,కృషి.

కాబట్టి, మీరు కనుక ఒక నూతన ప్రపంచాన్ని తయారు చేయాలనుకుంటే, మానవులు అనుభవించిన యీ భయంకరమైన యుద్ధాలూ, యీ క్షోభా, యీ ఘోరాలు చూశాక తప్పక తయారు చేసి తీరాలి. అప్పుడు ఒక మత విషయైక విప్లవం మనలో ప్రతి ఒక్కరిలో వచ్చి తీరాలి. ఆ విప్లవం ఒక నవ్య సంస్కృతినీ, ఆసాంతం కొత్తదైన ఒక మతాన్నీ- అది ఆధిపత్యంతో కూడిన, పురోహితుల ఆచారవిధులతో కూడిన, మూఢ విశ్వాసాలు, కర్మకాండలతో కూడిన మతం కాదు - తీసుకువస్తుంది. అన్ని విధాలా భిన్నమైన ఒక సమాజాన్ని తయారు చేయాలంటే యీ మత విషయైక విప్లవం వచ్చి తీరాలి. అంటే వ్యక్తి లోలోపలే జరిగే విప్లవం; అంతే తప్ప నియంతృత్వాన్ని, బోధలని, భయాన్ని పెంచి పోషించే ఆ ఘోరమైన రక్తపాతాల విప్లవం కాదు. ఒక నూతన ప్రపంచాన్ని- అంటే పూర్తిగా భిన్నమైన అర్థంలో కొత్తదానిని మనం నిర్మిస్తే, అప్పుడది మన అందరి ప్రపంచం అవుతుంది; ఒక జర్మన్ ప్రపంచమో, రష్యన్ ప్రపంచమో, హిందూ ప్రపంచమో ఆవకూడదు. ఎందుకంటే మనమంతా మానవులం, యీ భూమి మనది.

అయితే, దౌర్భాగ్యం ఏమిటంటే, మనలో చాలా తక్కువ మంది వీటిని గురించి లోతుగా ఆలోచిస్తారు. ఎందుకంటే దీనికి ప్రేమ ఆవశ్యకమవుతుంది, భావోద్వేగం కాదు, ఆవేశతత్వం కాదు. ప్రేమ చాలా దుర్లభమైనది. భావోద్వేగంతోను, ఆవేశంగానూ వుండేవారు సాధారణంగా చాలా క్రూరంగా వుంటారు. పూర్తిగా భిన్నమైన ఒక కొత్త సంస్కృతిని తేవాలంటే మనలో ప్రతి ఒక్కరిలోనూ యీ మతపరమైన విప్లవం జరగాలని నాకు అనిపిస్తున్నది. అంటే అర్థం స్వేచ్ఛ పొందాలని. మత సూత్రాలన్నిటి