పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేహాలు, సమాధానాలు

77

నుండీ, అంధ విశ్వాసాలన్నిటినుండే కాదు, వ్యక్తిగతమైన ఆకాంక్షా పరత్వం నుండి, స్వార్థపూరిత కార్యకలాపాల నుండి కూడా స్వేచ్ఛ పొందాలి. అప్పుడు మాత్రమే ఒక నూతన ప్రపంచం ఆవిర్భవించ గలుగుతుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, X వాల్యూమ్,

హేంబర్గ్, 15 సెప్టెంబర్, 1956.


ప్రశ్న : నేను, నా భార్య ఎప్పుడూ పోట్లాడుకుంటూ వుంటాం. మా యిద్దరికీ ఒకరంటే మరొకరికి యిష్టమే. అయినా ఎందువల్లో యీ కీచులాటలు వస్తూనే వుంటాయి. చాలా అసహ్యంగా తయారయింది యిదీ. ఇదంతో మానేయ్యాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించాం. కాని యిద్దరమూ మానసికంగా ఒకరి నుంచి యింకొకరం స్వతంత్రంగా వుండలేకపోతున్నాం. మీ సలహా ఏమిటి?

కృష్ణమూర్తి : ఆధారపడటం అన్నది వున్నంతవరకు వొత్తిడి తప్పదు. నేను ఒక సఫలత సాధించడం కోసంగాను, అసంఖ్యాకమైన ప్రజలకు వుపన్యాసాలు యిచ్చే గొప్పవాడినని అనుకోవడానికి గాను శ్రోతలుగా మీ ఆలంబనాన్ని కోరుతుంటే, అప్పుడు నేను మీ మీద ఆధారపడుతున్నానన్నమాట, మిమ్మల్ని స్వలాభం కోసం పువయోగించుకుంటున్నాను, మానసికంగా నాకు మీ అవసరం వుంది. ఈ ఆధారపడటాన్ని ప్రేమ అంటున్నాం. మన సంబంధ బాంధవ్యాలన్నీ దీని మీదే నిర్మించుకున్నాం. మానసికంగా నాకు మీ అవసరం వుంది, మీకూ మానసికంగా నా అవసరం వున్నది. మీకు నాకు మధ్యన వున్న బాంధవ్యంలో, మానసికంగా నాకు మీరు చాలా ముఖ్యులు అవుతారు. ఎందుకంటే మీరు నా అవసరాలు తీరుస్తున్నారు. ఒక్క శారీరకంగానే కాదు, అంతర్గతంగా కూడా మీరు లేకపోతే నేను అయోమయమై పోతాను, సందిగ్ధంలో పడిపోతాను. మీ మీద నేను ఆధారపడుతున్నాను; మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆ ఆధారపడటం గురించి సందేహాలు రేకెత్తినప్పుడల్లా సందిగ్ధంలో పడతాను. అప్పుడు భయం కలుగుతుంది. ఈ భయాన్ని దాచడానికి రకరకాల కపటవేషాలు వేస్తాను. భయం బారినుండి తప్పించుకొని పోవడానికి అవి సహాయం చేస్తాయి. మనకి యిదంతా తెలుసు. మనలో వున్న శూన్యాన్ని, మనలో వున్న వొంటరితనాన్నీ కప్పిపుచ్చడానికి సాధనాలుగా ఆస్తిని, సమాచారాన్ని, దేవుళ్ళనీ, రకరకాల భ్రాంతులను, బాంధవ్యాలను వుపయోగిస్తూ వుంటాం. అందువల్ల అవన్నీ చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంతరించు కుంటాయి. మనకి పలాయన మార్గాలుగా వుపయోగపడుతున్న వాటి విలువ బ్రహ్మాండంగా ఎక్కువవుతుంది.