పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

61

దుఃఖంతో నిండిపోయిన మనసుకు ప్రేమ అంటే ఏమిటో ఎన్నటికీ తెలియదు. మీకు తెలుసా ప్రేమ అంటే ఏమిటో? పరిశీలించేవాడికి, పరిశీలిస్తున్న అంశానికీ మధ్యన స్థలం వున్నట్లవుతే ప్రేమ లేనట్లే.

స్థలం అంటే ఏమిటో మీకు తెలుసునా? మీకూ, ఆ చెట్టుకూ మధ్యన వున్న ఎడం, మీకూ, మీరు ఎట్లా వుండాలని అనుకుంటున్నారో దానికీ మధ్యన వున్న ఎడం. ఒక కేంద్రం- అంటే పరిశీలకుడు వున్నప్పుడు ఎడం అన్నది ఏర్పడుతుంది. అర్థమవుతున్నదా? ఒక విధంగా యిది చాలా సరళమైనదే; అయితే పోను పోను పరమ సంక్లిష్టంగా తయారవుతుంది. ముందు సరళంగా ఆరంభిద్దాం. ఈ వక్తముందు వున్న శబ్ద గ్రహణ యంత్రం (మైక్రోఫోను చూడండి. ఈ మైక్రోఫోను ఒక స్థలంలో వున్నది. అయితే మైక్రోఫోను కూడా కొంత చోటును సృష్టిస్తున్నది. నాలుగు గోడలతో వున్న ఒక యిల్లు వుంది. ఆ నాలుగు గోడల బయటనే కాకుండా, వాటి మధ్యన కూడా స్థలం వున్నది. అట్లాగే మీకు చెట్టుకు మధ్యన చోటు వున్నది. మీకు, మీ పొరుగువారికి మధ్యన, మీకు, మీ భార్యకు మధ్యన చోటు వున్నది. మీకు, మీ పొరుగువారికి మధ్యన, మీకు, మీ భార్యకో భర్తకో లేదూ యింకొకరికో మధ్యన యీ చోటు వున్నంతకాలం, యీ స్థలాన్ని తయారుచేస్తున్న ఒక కేంద్రం వున్నదని అర్థంచేసుకోవాలి. ఇదంతా అర్థం అవుతున్నదా? నక్షత్రాల వంక చూస్తున్నప్పుడు ఆ నక్షత్రాలను చూస్తున్న మీరు వుంటారు; ప్రకాశిస్తున్న నక్షత్రాలతో, స్వచ్ఛమైన చల్లని గాలితో కూడిన సాయంత్రపు రమణీయమైన ఆకాశమూ వుంటుంది. మీరు, అంటే పరిశీలకుడు, పరిశీలిస్తున్న అంశమూ వుంటాయి.

కాబట్టి, స్థలాన్ని సృష్టిస్తున్న కేంద్రం అంటే మీరే. ఒక చెట్టు వైపు మీరు చూస్తున్నప్పుడు, మీ గురించీ, ఆ చెట్టు గురించి మీలో ఒక మనోబింబం వుంటుంది, ఆ కాల్పనిక బింబమే చెట్టుని చూస్తున్న కేంద్రం. కాబట్టి మధ్యన ఒక ఎడం ఏర్పడుతున్నది. మేము చెప్పినట్లుగా యీ ఎడం లేనప్పుడే ప్రేమ వుంటుంది. అంటే పరిశీలకుడు తనకూ ఆ వృక్షానికీ మధ్యన సృష్టించే ఆ స్థలం లేనప్పుడు, మీ భార్యను గురించి మీకొక కాల్పనిక బింబం వుంటుంది. మీ భార్యకూ మీ గురించి ఒక కాల్పనిక బింబం వుటుంది. ఈ కాల్పనిక బింబాన్ని మీరు పది సంవత్సరాల పాటో, రెండు సంవత్సరాల పాటో లేదూ ఒక్క రోజులోనో, ఆమె సుఖాలతో, మీ సుఖాలతో, ఆమె అవమానాలతో, మీ అవమానాలతో నిర్మించుకుంటూ వచ్చారు. ఆమెని నసతో వేధించడం ద్వారా, పెత్తనం చలాయించడం ద్వారా, యింకా అటువంటి వాటి ద్వారా దానిని నిర్మించుకొచ్చారు. ఈ రెండు కాల్పనిక బింబాల మధ్యనున్న పరిచయాన్ని