పుట:కాశీఖండము.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

శ్రీకాశీఖండము


వ.

[1]అంతఁ బెద్దకాలంబున నీలలోహితుం[2]డు ప్రత్యక్షం బై వరంబు వేఁడు మనిన సులక్షణ యవ్విరూపాక్షునకుఁ బ్రణమిల్లి వినయంబున ని ట్లనియె.

334


తే.

మీనకేతనదమన! యీమేఁకపిల్ల
ప్రాణసఖివోలె నాయొద్దఁ బాయకుండు
శర్వ! యీనోరుమాలినజంతువునకు
మొదలు వర మిమ్ము వర మిమ్ము తుదకు నాకు.

335


వ.

అనిన విని శంకరుండు కరుణాతరంగితాంగీకారం బైనకటాక్షవీక్షణాంకురంబునం గురంగాక్షిం గనుంగొని గౌరీహృదయానురోధంబున బర్కరి యన్యజన్మంబునం గాశీరాజుపట్టపుదేవికిం గూఁతురై పుట్టునట్లుగా వరం బోసంగె. బర్కరిపేర నయ్యుత్తరాదిత్యకుండంబు బర్కరీకుండం బనంబరఁగె. గుణానురాగిణి యైనగౌరి సులక్షణఁ దనకుం జెలికత్తియంగాఁ గైకొని జయ, విజయ, జయంతిక, శుభానంద, సునంద, కౌముది, యూర్మిళ, చంపకమాల, మలయవాసిని, కర్పూరతిలక, గంధధార, శుభ, అశోక, విశోక, కమలగంధి, చంచననిశ్శ్వాస, మృగమదోత్తమ, కోకిలాలాప, మధురభాషిణి, గద్యపద్యనిధి, యనుక్తజ్ఞ మొదలయిన చెలికత్తియలనుం బోలె నబ్బాలబ్రహ్మచారిణి యైన యయ్యలివేణి నాదరించె. ఇది యుత్తరార్కుమాహాత్మ్యం బనుటయు నైమిశారణ్యనివాసులు మహాత్మా! యింకనుం గాశికానగరపంచక్రోశపుణ్యక్షేత్రంబునం గలదేవతాస్థానం

  1. ఇవ్విధంబున నుండ నంత గొంతకాలంబునకు
  2. డక్కన్యకామణి సన్నిధికిం