పుట:కాశీఖండము.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

329


బులు, పుణ్యతీర్థంబులు వివరించి మముం గృతార్థులం జేయు మనుటయు.

336


ఆశ్వాసాంతము

శా.

ధారాపట్టణసార్వభౌమ [1]సురధాణ్దర్పాపహారక్రియా
ధౌరంధర్యపటిష్టనిష్ఠురభుజాదంభోళిసంరంభ! దా
క్షారామప్రమదాకటాక్షలహరీవ్యాపారనీరాజితా
కారశ్రీజితమత్స్యకేతన! సమిద్గాండీవబాణాసనా!

337


క.

వేంగీవిషయాధీశ్వర !
సంగరగంగాతనూజ! సాహిత్యకళా
సంగీతలక్ష్యలక్షణ
భంగీసర్వజ్ఞ! విమలపాండిత్యనిధీ!

338


మాలిని.

చతురుదధిచతుర్దిక్సౌధవీథీవిటంకా
ప్రతినవబహుముక్తారంగవల్లీమతల్లీ
ప్రతిమవిమలకీర్తీ! పంచనారాచమూర్తీ!
వితరణసురభూజా వేమమాంబాతమాజా!

339


గద్య.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతం బైనకాశీఖండం బనుమహాకావ్యంబునందుఁ బంచమాశ్వాసము.

  1. సురరాట్దర్పా