పుట:కాశీఖండము.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

శ్రీకాశీఖండము


తే.

చెంచునింటికిఁ బోయి చెంచెతకుఁ బ్రియము
చెప్పి నమ్మించి తలమీఁదఁ జెయ్యి వెట్టి
వెఱకు మని తన్ముఖంబున నెఱుకుఱేనిఁ
గాంచి యాతనితోడ సఖ్యంబు చేసి.

71


వ.

అతఁడుం దానునుం గూడి యయ్యస్థిశకలంబులు పారంజల్లిన కాంతారప్రదేశంబున కేతెంచి నప్పుడు.

72


తే.

ఎముకలు చల్లినట్టిచో టెఱుఁగఁ డయ్యె
దైవవశమున నాభిల్లతస్కరుండు
దిగ్భ్రమం బెత్తి యందంద తిరుగుచుండెఁ
గానలోపల నెచ్చోటఁ గానలేక.

73


క.

వచ్చినయడవిక వచ్చుం
జొచ్చినకాననమ చొచ్చుఁ జోరపుళిందుం
డెచ్చో నస్థులు గానక
యచ్చెరుపడె దైవమతము లవి యల్పములే?

74


వ.

అయ్యస్థులు చల్లినచోటు దప్ప నడచుకొని కిరాతుండు బహుళ క్షుత్పిపాసాపరవశుం డయి హాహాకారంబు సేయుచుం [1]గ్రమ్మఱం గాశీపురంబున కరిగి తన మందభాగ్యత్వంబు ప్రకటించుచు మందాకినీస్నానంబు చేసి మఱలి నిజస్థానంబునకుం బోయెం గావున.

75


తే.

అనఘచారిత్ర! విశ్వేశ్వరాజ్ఞఁ గాని
కాదు వారాణసీనగరంబుఁ జొరఁగ
బలిమిఁ జొచ్చిన యేని నప్పంచజనుఁడు
పడనిపాటులఁ బడు విఘ్నపంక్తిచేత.

76
  1. జనియె. నిటవైశ్యుండును అస్థియుం గిరాతునిం గానక అగ్గి దాఁక