పుట:కాశీఖండము.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

శ్రీకాశీఖండము

విష్ణుదూతలు శివశర్మకు సంయమనీస్వరూపంబుఁ దెల్పుట

సీ.

కఱకులై వ్రేలినకుఱుచజుంజుఱువెండ్రు
        కలును గందెనచాయకాయములును
గలివోసి నాన్చినగ్రచ్చకాయలభంగి
        గొఱమాలినట్టిదృగ్గోళకములు
తొట్టివాతెఱలపై దూరంబు సాగిన
        గొగ్గిపండులతోడి కుముఖములును
గూనివీఁపులమీఁద గోడియై బోడెత్తి
        తఱివడ్డకంకాళదండములును


గీ.

రాసభక్రూరకంఠనిర్హ్రాదకఠిన
ఘర్ఘరవ్యక్తభాషితోద్గారములును
గలిగి యిదె కొంద ఱున్నారు గగనవీధి
నొరిమెఁ నొడఁగూడుకొని యెవ్వరొక్కొ వీరు?

138


వ.

అనిన నద్దివ్యపురుషు లతని కిట్లనిరి.

139


ఆ.

ఇది పిశాచలోక మీ ధూమ్రవర్ణులు
విను పిశాచరాజు లనఘ! వీరు
చంద్రశేఖరుని బ్రసంగవశంబునఁ
గొలిచినారు భక్తి గొంచియంబు.

140


వ.

అనియిట్లు క్రమంబునఁ బ్రశ్నోత్తరరూపంబునఁ గర్మానురూపంబు లగుఫలంబు లనుభవించుచు [1]నుందురనిన నమరభావంబుల నుత్తరోత్తరాభ్యున్నతంబు లగు నాయాయిలోకంబుల వసియించియున్న పుణ్యపురుషులం గనుంగొనుచు శివశర్మ గుహ్యకలోకంబును గంధర్వలోకంబును విద్యా

  1. (తమతమ తరతమ)