పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందు సంఘమునుండి బహిష్కృతులయిన బాహ్లికు లనేకులుపోయి హిమాలయముల కుత్తరముగా పశ్చిమ భాగమున గల "బాక్" నగరము ప్రధాన స్థానముగా గల దేశమున నివసించిరి. శకులు నివసించిన దేశము "శాకస్థాన" మని (ఇది పర్షియాలో దక్షిణ పశ్చిమముగా గలదు.) పేరొందినది. "పరశకులు" పోయి నివసించినభూమి 'పారశీక' మైనది. ఇందే పల్లవులు కూడ (దక్షిణమున) నివసించిరి. బహిష్కృతులయిన భారతీయ క్షత్రియ జాతివారగు యవనులు భారతమున గల యవన రాష్ట్రములనుండి అసంఖ్యాకులుగా వెడలిపోయిరి. అట్టివారిచే ఆక్రమింపబడిన ప్రదేశము "అయోనియా" యని పేరుపొందినది. అందు నివసించిన భారతీయక్షత్రియశాఖవారు 'అయోనియను' లనబడిరి. కాలము గడచుచుండగా ఉత్తర ఐరోపానుండి క్రీ. పూ. వేయి సంవత్సరములక్రింద దిగివచ్చిన "గ్రీకు" లను పేరుగల మోటుజాతివారివలన "అయోనియను"ల నాగరికత యంతయు నాశన మొనర్పబడినది. అయోనియనులును గ్రీకులునుకలిసి సాంకర్యమును జెందిరి. అయోనియా దేశము జయించిన జాతివారల పేరున "గ్రీస్" అని పిలువబడినది. అందు నివసించుచుండిన అయోనియనులు కూడ గ్రీకుల సాంకర్యమున 'గ్రీకు' లని పిలువబడిరి. కాని నాగరికులగు అయోనియనులతో రక్తసంబంధము కలిగినందున గ్రీకులు క్రమక్రమముగా నాగరికులయి అయోనియనులతో మిశ్రమమయి పోయిరి. క్రూరత్వములో ఉభయులును సమానులైనందున అది ఆ మిశ్రమజాతులందు మితిమీరిపోయినది. ఉభయజాతి వారలును నాగరికులగు అయోనియనుల పేర్లనే హెచ్చుగా పెట్టుకొనుచుండిరి. అతిపురాతనకాలమున భారతవర్షమునుండి పారశీకమునకును అచటినుండి క్రమక్రమముగా ఐరోపాకును పోయి అచట గిరి గహ్వరములయందు నివసించెడి భారతీయులయిన మోటుజాతి వారును భారత దేశమునుండి వలసపోయిన శక, యవన, హూణ, రూమకాది బహిష్కృత క్షత్రియజాతివారును కలిసి ఒకరొకరితో రక్తసంబంధములను కలుపుకొని వారితో మిళితమై అనేక సంకీర్ణజాతులు (Mixed