పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

Races)గా ఏర్పడిరి. ఈ విషయమును గురించి 'కెల్లారు, టైలరు' అనెడి ఇరువురు పాశ్చాత్య పండితులు ఈవిధముగా వ్రాసియుండిరి:-

"The Europeans became in time many races and tribes and that they, mixing with the barbarians became themselves savages, have been clearly proved by the researches of the European scholars." (vide Kellar's "The Lake Dwellings' and Taylor's 'The Origin of the Aryans.')

'కాలము గడచుచురాగా ఐరోపీయులు అనాగరికులగు మోటుజాతులతో కలిసినందున అనేక జాతులుగాను, గుంపులుగాను నగుటయే కాక వారే అనాగరికములగు మోటుజాతులుగానై క్రూరులై పశుప్రాయులుగా మారిపోయి రని ఐరోపీయ పండితుల పరిశోధనల వలన చక్కగా ఋజువైనది.' అని వ్రాసియున్నారు.

బహిష్కృతులయిన ద్రవిడులవలన (అరవవారివలన) ఆక్రమింపబడిన ప్రదేశము "ఆరబ" దేశ మని పేరొందినది. చీనులవలన చీనా దేశమను పేరు కలిగినది. దరదులు "దరద" దేశవాసు లైయుండిరి. బర్బరులవలన ఉత్తరాఫ్రికాలోను, తూర్పుఆఫ్రికాలోను గల 'బర్బర' రాష్ట్రములేర్పడినవి. (Barbery States) హూణులవలన ఐరోపా ఖండములో చాల భాగ మాక్రమింపబడినది. హారులు పశ్చిమోత్తర సరిహద్దురాష్ట్రమున కొండజాతులవా రైయుండిరి. వారిప్పుడు మహమ్మదీయ మతమందే చేరియున్నారు. వారి కిప్పటికిని 'హారులు' (Hurs) అను నామమే కలదు. ఈవిధముగా భారతవర్షములోని బ్రహ్మవర్త దేశమునం దుద్భవించిన మానవ జాతి అనేకములయిన మార్పులను చెంది భిన్నాచార వేష భాషాదుల నొంది వివిధ నామములతో పిలువబడుచు అనేక జాతులుగా చూపట్టుచుండిరి. 'భారత వర్షమే మానవజాతికి పుట్టినిల్లు' అని దిగువవాక్యము సూటిగ చెప్పుచున్నది.

           "తదేత ద్భారతం వర్షం సర్వ బీజం ద్విజోత్తమ!"
           "ఈ భారతవర్షము అఖిలమానవజాతికి పుట్టినిల్లు."