పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'రాజపుత్రు' లను నామమున ప్రసిద్ధికెక్కిరి. వీరలు ముప్పది ఆరు వంశములుగా ఏర్పడిరి. కాని క్రీస్తుశకము పదునారవ శతాబ్దములో వ్రాయబడిన "పృధ్వీరాజరాసా" యనెడి గ్రంధమున నీయబడిన జాబితాలో ఇరువది రెండు (22) శాఖల పేరులు మాత్ర మీయబడినవి. మిగిలిన పదునాలుగు శాఖలును ఆనాటికి నశించి యుండవచ్చును.

ఆ శాఖల పేరులు:- 1. రవి 2. శశి 3. యదు 4. కాకుత్థ్స 5. పరమార 6. సదాపర లేకతోమర 7. చౌహాన్ 8. చాలుక్క 9. భిండక 10. సిలార 11. అభీర 12. తోయమట లేక మక్వానా 13. చపోత్కట 14. పరిహార 15. ధాన్యపాలక 16. రాజ్యపాలక 17.నికుంప 18. హూణ 19. గుహిల లేక గుహిలపుట్ట 20. రాథోడు 21. కారట్టపాల 22. అనిగ. ఈ పేర్లు కొద్దిమార్పులతో 'కుమారపాల చరితము'న కూడగలవు. అందు:-

1. కాకుత్థ్స వంశమువారిది 'గ్వాలియరు' రాష్ట్రము.

2. పరమార వంశమువారిది 'మాల్వా'. (ఉజ్జయిని ముఖ్యపట్టణము)

3. సదావర లేక తోమర వంశమువారిది "ఢిల్లీ".

4. చాహుమాన వంశమువారిది "సంభార్".

5. ఛందాక లేక ఛండెవారిది "జిఝోటి". (బుందేలుఖండు అని ఇప్పటి పేరు). ఇది నె9రు భిండకవంశము కావచ్చును.

6. సిలారా లేక సిలాహారులది 'తానారాష్ట్రము'.

7. అభీరులది దక్షిణఇండియాలోని రాజ్యము.

8. ఛపోట్కటులది 'అనహల్వాడారాష్ట్రము.

9. పరిహారులది 'కనోజి', 'మండవార్‌'.

10. గుహిలాటులది మీవాడును కథియవాడులోని మంగ్రోలును.

యాదవ, ఛాటీ, జాడేజా, చూఢాసమ అనెడి ఇతర కులముల వారు యుద్ధవిద్యయం దారి తేరిన శాఖలు. ఇవి కథియవారులో గలవు. వీరి రాజ్యములు బియానా, మధుర, మహావన అనునవి ఐయున్నవి.