పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పర్యాటక రంగం

103. పర్యాటకుల్ని రాష్ట్రానికి ఆకర్షించే విధంగా ముఖ్య పర్యాటక స్థలాలను సమగ్రంగా అభివృద్ధి చేయటం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాతీయ పర్యాటక పటం పైన ఆంధ్రప్రదేశ్ కు సుస్థిర స్థానాన్ని సముపార్జించడం కోసం హోటల్ రంగంలోనూ, రిసార్టుల రంగంలోనూ పెట్టుబడుల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.

అగ్రిగోల్డ్ స్కాం బాధితులకు పరిహారం

104. గౌరవనీయ ముఖ్యమంత్రి వారు వారి పాదయాత్ర సందర్భంగా తనను కలుసుకున్న అగ్రిగోల్డ్ స్కాం బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేర్చడంలో భాగంగా రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు రూ.264 కోట్ల మేరకు పరిహారాన్ని చెల్లించడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అగ్రిగోల్డ్ స్కాం బాధితులకు రూ.200 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

శాంతి భద్రతలు

105. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా గ్రూపు పర్సనల్ ప్రమాద బీమా పరిమితిని ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.13 లక్షలుగా ఉన్నదాన్ని ఒక్కొక్కరికి రూ. 20 లక్షలుగా పెంచటం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అన్ని తరగతుల పోలీసు సిబ్బందికి ఈ పరిమితి పెంపుదల వర్తిస్తుంది. 2019 అక్టోబరు 1వ తేదీ నుండి హోం గార్డుల విధి నిర్వహణ భత్యాన్ని రోజుకు రూ.600 నుండి రూ.710 కి పెంచటం జరిగింది. పోలీసు శాఖకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.5,988.72 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

ఆర్థికాభివృద్ది తీరుతెన్నుల సమీక్ష

106. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మొదట సవరించిన అంచనాల ప్రకారం రూ.8,62,957 కోట్ల రాష్ట్ర స్థూల అభివృద్ధి ఉత్పత్తి మలి అంచనాల ప్రకారం ప్రస్తుత

39